ఈ మేరకు ద్విచక్ర, త్రిచక్ర వాహన సంస్థ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ కోసం ప్రత్యేకంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది.. చేతక్ ఉత్పత్తిని మరింత పెంచే దిశగా సంస్థ ముందుకు వెళుతుందని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్.. సీఎన్ బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. బజాజ్ ఎలెక్ట్రిక్ స్కూటర్ కోసం దేశంలోని ముఖ్య నగరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక బెంగుళూర్, హైదరాబాద్ ,ఢిల్లీ నగరాలను ముఖ్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ ప్రభుత్వాల ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలు ఎంతో ప్రోత్సాహకరం గా ఉండటం తో ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఈ చేతక్ స్కూటర్ చకాన్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది..
2025నాటికి 80 శాతం కొత్త ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను పూర్తిగా ఈవీల్లోకి మార్చాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.ఢిల్లీ మంచి ఆఫర్లను ప్రజలకు ఇస్తున్నాయి.. కర్నాటక ప్రభుత్వం 20 శాతం వరకు రాయితీ ఇస్తుందని వెల్లడించారు.రానున్న రోజుల్లో చేతక్ పోర్టుఫోలియోను విస్తరించటంతో పాటు కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకురావటం ద్వారా గట్టి పట్టును చేజిక్కించుకోవాలని చూస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో చేతక్ ఎలెక్ట్రానిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు ఆయా కంపెనీ దృష్టి సారిస్తుంది.ఈ స్కూటర్ ల కోసం ఫ్రీ బుకింగ్ ను అమలు చేస్తామని వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి