ఏ పండుగకు ఇవ్వని ఆఫర్లు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఇస్తారు.. ఆ రోజుకు ఉన్న ప్రత్యేకతే అది. ఫిబ్రవరి నెల వచ్చిందంటే అంటే ఒకటో తారీఖు నుంచే హంగామా మొదలవుతుంది.. సోషల్ మీడియా లో అయితే చెప్పనక్కర్లేదు.. హో రేంజులో రచ్చ మొదలవుతుంది.ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్లు ప్రియురాలికి ఏ గిఫ్ట్‌ ఇవ్వాలి? ఎక్కడకు తీసుకెళ్లాలి? అని ప్లానింగ్స్‌ వేస్తుండగా.. ఇంకా ఇప్పుడే ప్రేమలో దిగుతున్నవాళ్లు నచ్చిన అమ్మాయి మనసు ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేమించినవాళ్లను సర్ ‌ప్రైజ్‌ చేసేందుకు ఏం చేయాలా? అని గూగుల్‌ తల్లిని అడుగుతున్న క్రమంలో ఓ మెసేజ్‌ చాలామందిని ఆకర్షిస్తోంది. వాలంటైన్స్‌ డే సందర్భంగా తాజ్‌ హోటల్‌ మీకో బంపర్‌ ఆఫర్‌ ఇస్తోందంటూ యూత్‌ను ఊరిస్తోంది. తాజ్‌ హోటల్‌లో ఏడు రోజుల పాటు ఉచితంగా ఉండే అవకాశం లభించింది. మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి" అంటూ ఓ లింక్‌ కనిపిస్తోంది. దీన్ని క్లిక్‌ చేయగానే 'మీరు కరెక్ట్‌ గిఫ్ట్‌ బాక్స్‌ను ఎంపిక చేసుకుంటే తాజ్‌ హోటల్‌లో నివసించే ఛాన్స్‌ మీ సొంతం, గుడ్‌ లక్' అని ప్రత్యక్షమవుతుంది.. దానికి ఓకే అని నొక్కగానే కొన్ని ప్రశ్నలను అడుగుతుంది.వాటికి సరైన సమాధానం చెప్తే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.దాన్ని ఓ ఐదు వాట్సాప్‌ గ్రూపులకు లేదా 20 మందికి షేర్‌ చేయమని అడుగుతుంది. అవన్నీ పూర్తి చేశాక కథ మళ్లీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇదో ఫేక్‌ మెసేజ్‌. ఈ వైరల్‌ మెసేజ్‌పై తాజ్‌ హోటల్‌ స్పందిస్తూ ప్రేమ జంటల కోసం తాము ఎలాంటి గిఫ్ట్‌ కార్డులు పంపించడం లేదని స్పష్టం చేసింది. కాబట్టి మీకు కనక ఆ మెసేజ్‌ ఎవరైనా ఫార్వర్డ్‌ చేస్తే తాజ్‌ హోటల్‌లో ఏడు రోజులు ఉచితంగా గడపొచ్చని కలల్లో తేలిపోకండి.. మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకొండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: