ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం కన్నా ఇంట్లోనే ఉండి, పొట్ట గడుపుకునేందుకు పైసలు ఉంటే చాలానే భావన చాలా మందికి ఉంటుంది.. అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే డబ్బులు వస్తాయా? ఒకవేళ పెద్ద అమౌంట్ పెడితే నష్టాలు వస్తే? ఇలాంటి సందేహాలు రావడం మానవ సహజం.. అయితే అలా చిన్న మొత్తంలో డబ్బులు సంపాదించాలని అనుకునేవారికి అదిరిపోయే బిజినెస్ ఒకటి ఉంది.. అది కూడా కూర్చున్న చోటే డబ్బులు సంపాదించవచ్చు.. అదేంటో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 


తక్కువ ఖర్చుతోనే ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు. అదేసమయంలో మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు.
రాగి మాల్ట్ బిజినెస్‌తో మంచి రాబడి పొందొచ్చు. రోజుకు రూ. 4 వేల వరకు సంపాదించొచ్చు. అంటే నెలకు రూ.లక్ష పైనే ఆదాయం వస్తుందని చెప్పుకోవచ్చు. రాగి మాల్ట్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. గ్రీన్ టీ, లేదా ఏ ఇతర పానీయాలతో పోలిస్తే ఈ రాగి జావా ఆరోగ్యానికి చాలా మంచిది..అది కూడా ఈ ఎండాకాలంలో అయితే మరీ మంచిది.. 


రాగులు తీసుకోవడానికి కొద్దిగా ఇన్వెష్ట్ చేయాలి.. అలాగే పార్కులు దగ్గర చిన్న షాప్ లాగా పెట్టుకోవాలి. మొదట్లో మాత్రమే కాస్త ఖర్చు అవుతుంది. టీ స్టాల్ లాంటి చిన్న షాప్ అయితే చక్కగా ఉంటుంది. చిన్న స్టౌవ్.. ఇతరత్రా సామానులు ఉంటే సరిపోతుంది. ఒక గ్లాస్ రాగి మాల్ట్ 30-40 రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రాగి మాల్ట్ చక్కని మెడిసిన్.. ఎండ వేడిమి కూడా రాగి మాల్ట్ తీసుకోవడం వల్ల తగ్గుతుంది. ఉదయం సాయంత్రం కనుక ఈ షాప్ ను ఓపెన్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..రోజుకు 1000 రూపాయలు ఖర్చులు పోగా మూడు నుంచి నాలుగు వేలు రోజుకు వస్తాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. ఇంక ఆలస్యం ఎందుకు తక్కువ ఖర్చు తో ఎక్కువ లాభాలను పొందే ఈ బిజినెస్ ను మీరు కూడా మొదలు పెట్టండి .. లాభాలను పొందండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: