
ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అంటే అది రిస్క్ లో పడ్డట్టే. అయితే ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఒక బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. ఒకవేళ డబ్బు మీద ఆధారపడి జీవించే వాళ్ళకు ఈ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలాంటి లాభనష్టాలను చూపిస్తుందో.. తెలియదు కాబట్టి అలాంటి వారు ఇందులో చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ స్టాక్ మార్కెట్ లో నష్టాల కన్నా లాభాలే ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్కెట్ ధరలకు అనుగుణంగా, ఈ షేర్ ధరలు కూడా పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. అయితే ఆరు నెలల కాలంలోనే మీకు అదిరిపోయే లాభాలను కూడా ఈ స్టాక్ మార్కెట్ అందించింది. అయితే అదిరిపోయే ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే అడోర్ వెల్డింగ్. ఇందులో ఆరు నెలలు ఇన్వెస్ట్ చేయడం వల్ల 165% రాబడి వరకు స్టాక్ మార్కెట్ అందించింది. ఇకపోతే ఆరు నెలల కిందట ఒక్కో షేరు ధర 282 రూపాయలు ఉండేది. అయితే ఇప్పుడు ఒక్కొక్క షేర్ ధర 750 రూపాయలకు ఎగబాకింది. ఇక దీంతో ఇన్వెస్టర్ల పంట పండింది అని చెప్పవచ్చు. అంటే ఆరు నెలలకు ముందు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆరు నెలలు ముగిసిన తర్వాత చేతికి రూ. 2.50 లక్షలు చేతికి వస్తాయి. కాబట్టి మీరు కూడా నిపుణుల సలహా మేరకు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలను పొందవచ్చు.