కరోనా కష్ట సమయంలో ఎంతో మందిని ఆదుకుంది ఈ స్టాక్ మార్కెట్ అనే చెప్పాలి. ఎంతో మంది పెట్టుబడి దారులను స్టాక్ మార్కెట్ ఒక్క సారిగా ధనవంతులను చేసి ఆశ్చర్యపరిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్ల షేర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందనే చెప్పాలి.
ఇక కొన్ని మెలుకువలు తెలిసి ఉండి అవగాహన పెంచుకుంటే స్టాక్ మార్కెట్ లో లాభాలు మీ సొంతం అంటున్నారు షేర్ మార్కెట్ నిపుణులు.
ట్రాక్ రికార్డ్ అనే మాటను గుర్తుంచుకోవాలి: సాధారణంగా ఏ కంపెనీలో అయితే మనము ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటామో, ఆ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ ను చూసుకోవాలి, అదే విధంగా ఆ కంపెనీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి లాభాల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కేవలం లాభాలను ఆర్జించే కంపెనీల్లో మాత్రమే మీ పెట్టుబడిని పెట్టాలి.
పోర్ట్‌ఫోలియో అప్‌డేట్ : స్టాక్ మార్కెట్ లో ఏవీ నిలకడగా ఉండవు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు అసలు ఊహించనివి జరుగుతుంటాయి. అయితే ఇక్కడ పొరపాటు ఏమిటంటే సరిగా అవగాహన చేసుకోకపోవడం. కాబట్టి మార్కెట్ పై దృష్టి సారించాలి. అలాగే దీర్ఘకాల దృష్టితో ఎప్పటికప్పుడు మీ పోర్టు పోలియోను అప్డేట్ చేస్తూ ఉండాలి.
లీడర్ స్టాక్: మరో ముఖ్యమైన విషయనికొస్తే అధిక విలువ గల స్టాక్‌ను ఎంచుకోవడం చాలా అవసరం అనే చెప్పాలి. స్టాక్ యొక్క ధర మరియు ఆదాయాల నిష్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు, దాని నుండి ఎక్కువ లాభాలను ఎక్స్పెక్ట్ చేయడం సరి కాదు. ఇలాంటి సందర్భంలో ఫ్యూచర్ లో పరుగులు తీసే రంగాలను గుర్తించి వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో కూడా లీడర్ కంపెనీలను సెలెక్ట్ చేసుకోవాలి. లీడర్ కంపెనీలు ఎపుడు కూడా పూర్తి ఫోకస్ అభివృద్ధి పైనే ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి