అమరావతి లో ముందుగా రైతులకు స్థలాలు ఇస్తే నివాసముంటారా లేక తక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంది. దాని విలువ పడిపోతుంది. అలా కాకుండా ఎకరం భూమిని ఎక్కువ ధరకు అమ్మి దాని విలువ పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కావొచ్చు. కానీ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది అక్కడి పరిస్థితి. దీంతోపాటు గతంలో రూ. కోట్లలో కొనుగోలు చేసిన భూమి ఇప్పుడు లక్షలకు పడిపోయింది.


ఇప్పుడు అలాంటి పరిస్థితే చైనాలో సంభవించింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వంద కోట్లకు పై చిలుకు ఇళ్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చైనా రియల్టీ సంక్షోభం నానాటికీ పీకల్లోతుకు కూరుకుపోతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి ఇళ్లు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ దాదాపు వందకోట్ల నివాస గృహాలు ఉన్నాయి. అవి కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయని దేశ గణాంకాల శాఖ బ్యూరో మాజీ డిప్యూటీ హెడ్ హేకే స్వయంగా చెప్పారు.


దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అపార్ట్మెంట్ లే ప్రధాన కారణం. ఇవి కాక ఇంకా చాలా దశలో నిర్మాణాలు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేవారు లేక రుణభారాన్ని తాళలేక చైనా రియల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ గ్రూపు దివాళా తీసింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. వీరికి రియల్ ఎస్టేట్ సంక్షోభం పెను సవాల్ గా మారింది. చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే.


ఒకప్పుడు దేశానికి వెన్నెముక గా ఉన్న రియల్టీ రంగం ఇప్పుడు పెనుభారంగా మారింది. చైనాలో పట్టణ జనాభా 60శాతానికి చేరింది. దీంతో వారంతా ఇళ్లను కొనుగోలు చేయడం నిర్మించడం లాంటివి చేశారు. ఇప్పుడు అవన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని నగరాలు శ్మశాన వాటికలుగా కూడా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: