ఇటీవల దేశంలో కురిసిన భారీ వర్షాలు ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసాయ్ అన్న విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల కారణంగా ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాలి. అటు అధికారులు సహాయక చర్యలు చేపట్టిన కొంత మంది ప్రాణాలు మాత్రం రక్షించ లేక పోయారు. ఇలా వర్షాల కారణంగా వచ్చిన భారీ వరదలతో కొంత మంది ప్రాణాలు కోల్పోతే.. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్ల తో మరి కొంత మంది ప్రాణాలు కోల్పోయారు.


 భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నో ఇళ్లు కూలిపోయాయి. చివరికి ఇలా కూలిన ఇళ్ల శిథిలాల కింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు చాలామంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలి నలుగురు కార్మికులు మరణించిన ఘటన సంచలనంగా మారిపోయింది. ఘటన బెంగళూరు సమీపంలోని హోసకొటే తాలూకా అనుగొండ హళ్లి  పారిశ్రామిక ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఇక ఘటనలో మృతులు, క్షతగాత్రుల అందరూ కూడా ఉత్తర భారత దేశానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.


 తెల్లవారు  జామున మూడు గంటల సమయంలో ప్రహరీ గోడ పక్కన తాత్కాలిక షెడ్యూల్ వేసుకొని నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఎంతో మంది కార్మికులు ఆ గోడ శిథిలాల  కింద చిక్కుకుపోయారు. స్థానికులు పోలీసులు వారిని బయటకు తీయగా.. నలుగురు తీవ్రగాయాలతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వీరూ బీహార్కు చెందిన మనోజ్ కుమార్, రామ్ కుమార్, నితీష్ కుమార్,, మణిదీప్ దాసులుగా గుర్తించారు. నాసిరకం నిర్మాణం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: