
ఇకపోతే ఇక్కడమరో దారుణ ఘటన వెలుగు చూసింది. సాధారణంగా దంపతులకు పిల్లలు పుడితే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తనకు కూతురు పుట్టింది అని మొదట ఎంతో ఆనందపడిపోయాడు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం కూతురిపై ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారిపోయింది. ఎందుకంటే తన కూతురికి తన పోలికలు రాలేదు అని అతను అనుమానపడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఓ రోజు దారుణానికే పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగ్రాలోని కండ్వాళి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. మన్మోహన్ సింగ్, మమత లకులకు కొన్నాళ్ళ క్రితమే పెళ్లయింది.
ఇటీవలే వారికి సౌమ్య అనే కూతురు పుట్టింది. ఇక ఆమెకు ఇప్పుడు ఏడాది వయసు. అయితే సౌమ్యకు తన పోలికలు రాలేదని మన్మోహన్ సింగ్ భావించాడు.ఈ క్రమంలోనే భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. దీంతో అనుమానంతో భార్య తప్పు చేసింది అనే ఆలోచన చేసాడు. ఇదే విషయంపై భార్యతో ఎన్నోసార్లు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తన భార్యకు పుట్టిన కూతురు తన పోలికలు లేవని అంటే తనకు పుట్టలేదు అంటూ అనుమానం పెంచుకున్నాడు. ఇక ఇటీవల భార్యను కూతురుని దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు.