ఇటీవల కాలంలో మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషుల్లో పైశాచికత్వం పెరిగిపోతోంది అని చెప్పాలి.  అయితే ఈ మాట ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు సాటి మనిషికి చిన్న సమస్య వస్తే అయ్యో పాపం అంటూ జాలి పడిన మనిషి ఇక ఇప్పుడు సాటి మనిషి విషయంలో రాక్షసత్వంతో వ్యవహరిస్తున్న తీరు అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. చిన్నచిన్న కారణాలకే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న మనిషి సాటి మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తు ఉన్నాయి.


 అడవుల్లో ఉండే జంతువుల కంటే సభ్య సమాజంలో ఉండే మనుషులే చాలా డేంజర్ అని ఎంతోమంది ప్రవర్తన తీరు చూస్తే అర్థమవుతుంది అని చెప్పాలి. ఇప్పటికే చిన్న చిన్న కారణాలకు ఎదుటివారిపై దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. అతను పండ్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక వచ్చే పోయే కస్టమర్లతో కూడా ఎంతో వినయంగా మాట్లాడుతూ తన వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నాడు సదరు వ్యక్తి. అయితే ఇటీవల సదరు పండ్ల వ్యాపారిని ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టారు.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నోయిడాలో యాపిల్ పండ్లు విక్రయించి పొట్ట కోసుకునే ఒక చిరు వ్యాపారిపై కేవలం ఐదు రూపాయల డిస్కౌంట్ కోసం ఇద్దరు కస్టమర్లు దారుణంగా దాడికి పాల్పడ్డారు. కిలో యాపిల్ ధర 90 రూపాయలు చెప్పగా.. 85కే ఇవ్వాలని అమిత్ సహా మరో స్నేహితుడు కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాగా చిరు వ్యాపారిపై  ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు. అక్కడున్నవారు ఆపేందుకు ప్రయత్నించిన వినకుండా దానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: