హైటెక్ వ్యభిచారం సిటీలల్లో  ఉగ్రరూపం దాల్చడంతో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి..శరవేగంగా ముందడుగు వేస్తున్న దేశ విదేశాల నుంచి వచ్చిన అనేక మంది యువతులకు మాయ మాటలు చెప్పి డబ్బు ఆశ కలిగించి వ్యభిచార కూపంలోకి దించూతున్నారు..ఈ నేపథ్యంలో వ్యభిచారం కూడా చప కింద నీరులా మారింది.. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు గ్రూపులుగా  ఏర్పడి బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, పార్కులు, బీచ్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి ఒంటరిగా ఉండే యువతులు, మహిళలతో పరిచయం పెంచుకుంటున్నారు.

 

 

 

మరికొందరు రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేటపుడు ఒంటరిగా ఉండే మహిళలు, యువతులతో మాటలు కలిపి వారి బలహీనతలు గుర్తించి సహాయం చేసినట్టు నటించి వారికి దగ్గరవుతున్నారు. ఏదో పని ఇప్పిస్తామని, ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు చూపిస్తామంటూ వారిని తమ ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. ఒకసారి తమ చేతికి చిక్కినతర్వాత బయటకు వెళ్లనీయకుండా తమ అనుచరులతో గృహనిర్బంధం చేస్తున్నారు.  ఎవరైనా ఎదురుతిరిగితే తమదైన శైలిలో చిత్రహింసలకు  గురిచేస్తున్నారు. వీరికి కొంతమంది పోలీసుల అండదండలు కూడా ఉండడంతో ఈ వ్యవహారం బహిర్గతం కావడం లేదు.

 

 

 

అంతేకాదు వచ్చిన డబ్బులను వారికి ఇవ్వాలి లేకుంటే తిండి పెట్టకుండా పనికి పేమిస్తారట.. ఇలాంటి మోసాలకు చాలా మంది బలవుతున్నారు. కొంత మంది ఈ ముఠాను తప్పించుకొని సొంత ఊర్లకు వెళ్లిన కూడా వారిని గాలించి పట్టుకొని మరి తీసుకొస్తున్నారు. అలా మాట వినని వారిని చంపేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల వైజాగ్ లో జరిగిన దివ్య హత్య. జనావాసాల మధ్యనే ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచారాన్ని గుట్టుగా నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన పక్కా సమాచారం లేకపోవడంతో దాడులు చేయలేకపోతున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. దీనిపై దృష్టి సారించాలని సీపీ ఆర్కే మీనా పోలీస్‌ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దివ్య లాంటి మరో యువతీ బాలి కాకుండా చూడాలని ఆర్కే మీనా పోలీసులకు హెచ్చరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: