హొలీ పండగ అంటే రంగులు చల్లుకునే పండగ. కానీ మందుబాబులు మాత్రం మద్యం చల్లుకునే పండుగలా చేస్తారు. మద్యం చల్లుకోవడం అంటే పైన కాదు కడుపులో బాటిళ్లకు బాటిళ్లు చల్లేసుకుంటారు. ఇక ఆ తరువాతే అసలైన పండగ మొదలవుతుంది. రంగులు పూసుకుని రోడ్లపై హంగామా చేస్తారు. అంతే కాకుండా పూటుగా తాగిన మత్తలో గొడవలు పేటట్టుకోవడం..రోడ్డు ప్రమాదాలు జరగటం సాధారణం. ఇక ఈ ఏడాది ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందే అప్రమత్తం అయ్యారు. జంట నగరాల్లో కఠిన చర్యలు అమలు చేసేలా ప్రణాలికను రూపొందించారు. హొలీ పండగ సంధర్బంగా జంట నగరాల్లో బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు ముసి ఉంచాలని
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ
ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. మార్చ్ 28వతేది సాయంత్రం 6 గంటల నుండి మార్చ్ 30 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో 36గంటలు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు.
రోడ్ల పై గుంపులు గుంపులుగా తిరగటం.. ఇతరులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం..రోడ్లపై రంగులు చల్లడం నిశేదం అని పేర్కొన్నారు.
హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రజలు హోళీ వేడుకలను జరుపుకోవాలని హెచ్చరించారు. వాహనాలపై గుంపులు గుంపులుగా ప్రయనిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులపై రంగలు చల్లవద్దని సీపీ వార్నింగ్ ఇచ్చారు. ఇక గతంలో హోళీ
పండుగ నాడు మందు బాబుల వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈనేపథ్యంలోనే కఠిన అంక్షలు అములు చేయాలని పోలీసులు భావించారు. మద్యం దుకాణాలు అయితే బంద్ పెట్టారు కానీ కొంతమంది తెలివిపరులు ముందు రోజే స్టాక్ పెట్టుకుని మరీ పూటుగా తాగుతారు. కాబట్టి ప్రజలు కూడా రోడ్డు పై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచింది.