అమ్మాయికి జీవితంలో పెళ్లి అనేది ఓ కీలక ఘట్టం. ఆడపిల్లను పెంచి పెద్దచేసి అయ్య చేతిలో పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆలోచిస్తుంటారు. ఇక అమ్మాయి పెళ్లి అంటే అబ్బాయి గురించి అన్ని తెలుసుకోవడానికి ఆరా తీస్తుంటారు. ఇక తన కూతురిని ఉద్యోగం ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటుందని చూసి అలాంటి అబ్బాయికి ఇచ్చి కట్టబెడుతుంటారు. ఇక అమ్మాయికి అంగరంగా వైభవంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తుంటారు.

అయితే ఎన్ని ఆశలతో మెట్టినింట్లో అడుగు పెట్టిన అమ్మాయికి వరకట్నాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇక అదనపు కట్నం కోసం అత్తింటి వాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. బాగా చదువుకుని.. ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న కొందరు కూడా ఇలా భార్యలను అదనపు కట్నం కోసం వేధిస్తుండటం సిగ్గుచేటు. అయితే ఆ వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక మరికొందరి విషయంలో మెట్టినింటి వాళ్లే కోడలిని కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి తరుణంలో కర్ణాటకలోని కలబురగిలో ఇలాంటి ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని కలబురగి పట్టణంలోని బ్యాంకు కాలనీలో నివాసముండే వీరన్న సివిల్ ఇంజనీర్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి రెండున్నరేళ్ల క్రితం రచిత(21)తో వివాహమైంది. ఇక పెళ్లి సమయంలో అబ్బాయి సివిల్ ఇంజనీర్ కావడంతో కూతురిని సుఖంగా చూసుకుంటాడని భావించాడు. ఇక అతడికి భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు.

అతడు పెళ్లయిన కొన్నాళ్లు భార్యతో అన్యోన్యంగానే ఉంటూ మంచిగానే చూసుకున్న వీరన్న రానురాను అదనపు కట్నంపై కన్నుపడింది. ఇక రుచితకు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. కన్నవారికి చెప్పుకోలేక వేధింపులు భరించలేకపోయిన రచిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: