కేసుల వివరాల పై ఇవాళ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ..మానవ అక్రమ రవాణా యూనిట్ రాచకొండ కమిషనరేట్ లో ప్రవేశ పెట్టి సంవత్సరం పూర్తి అయ్యిందని వెల్లడించారు. ఆన్ లైన్ యాప్స్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ను అరెస్ట్ చేసామని.. ఇతర దేశాల నుండి హైదరాబాద్ తీసికొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు కమిషనర్ మహేష్ భగవత్.

ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసాలు చేస్తున్న ముఠా ను అరెస్ట్ చేసామని.. యాంటీ హ్యూమన్ ట్రాఫింగ్ యూనిట్ వచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ క్రాస్ రోడ్ వద్ద నిందితులను అరెస్ట్ చేసామన్నారు.. ఉగాండా దేశానికి చెందిన మహిళ ను ఆర్గనేజర్ ను అరెస్ట్ చేసామని.. ఈ ముఠా నిర్వహిస్తున్న వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2605 మంది చిన్నారులకు విముక్తి కల్పించామన్నారు కమిషనర్  మహేష్ భగవత్.  రాచకొండ కమిషనరేట్ మొదలయినప్పటి నుండి ఇప్పటి వరకు యాంటీ ట్రాఫికి కింగ్ బాగా పనిచేస్తుందని చెప్పారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై కేసులు నమోదు చేసామని వెల్లడించారు కమిషనర్  మహేష్ భగవత్. ఇప్పటి వరకు 353 కేసులు 308 పురుషులు, 574 కస్టమర్ల ను అరెస్ట్ చేసామన్నారు.  యాదాద్రి జిల్లాలో వ్యభిచార గృహం లో 34 మైనర్ గర్ల్స్, 32 మేజర్ గర్ల్స్ ను కాపాడామని పేర్కొన్నారు. వ్యభిచారం కేసులో 131 మంది నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. 95 ట్రాఫికర్స్ మీద పిడి యాక్ట్ నమోదు చేసామని పేర్కొన్న  రాచకొండ కమిషనర్  మహేష్ భగవత్.. ఇక ముందు కూడా  రాచకొండ కమిషనర్ లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నేరస్థుల పట్ల కటినంగా వ్యవహరిస్తామని చెప్పారు మహేష్ భగవత్.






మరింత సమాచారం తెలుసుకోండి: