చదువుకుంటే ఉన్నమతి పోయింది అని అంటూ ఉంటారు కదా. నేటి రోజుల్లో కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అచ్చం అలాగే ఉంది. ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు మంచి మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ జీవితంలో సక్సెస్ వెనుక పరిగెత్తడం మానేసి.. కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే ఇలా కొత్తగా ఆలోచించడమే చివరికి చెత్త గా మారిపోతుంది . జైలు పాలు కూడా చేస్తుంది. ఎందుకంటే నేటి రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదివినవారు టెక్నాలజీ గురించి బాగా తెలిసిన వారు ఆ టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించడం కంటే నేరాలకు పాల్పడేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.


 టెక్నాలజీ సాయంతో ఎంతో మందిని బురిడీ కొట్టించి సైబర్ ఎటాక్ చేసి ఖాతాలను ఖాళీ చేయడం లేదా టెక్నాలజీ సాయంతో ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజటం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటిదే చేసారూ  విద్యార్థులు.  వాళ్ళు చదివింది బీటెక్ ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ బ్రతకడం  ఎందుకు అనుకున్నారో ఏమో.. నేరాలకు పాల్పడితే ఒకేసారి ఎక్కువ డబ్బు వస్తుంది కదా అని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఎంతోమంది అమ్మాయిలు మహిళలకు సంబంధించిన ఫోటోలను మార్పింగ్ చేసి పోర్న్ సైట్ల లో పెట్టి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. ఇక ఇలా ఎవరికి తెలియకుండా గుట్టుగా తమ వ్యాపారం కొనసాగిస్తూ వచ్చారు.



 ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం లో వెలుగులోకి వచ్చింది. బీటెక్  చదివిన ఇద్దరు విద్యార్థులు సంక్రాంతి పండక్కి ఊరికి వచ్చారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇద్దరు బీటెక్ ఫార్మసీ అమ్మాయిల ఫోటోలు తీశారు. ఇక వాటిని మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్ లో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు ఆ ఇద్దరు బీటెక్ విద్యార్థులు. అయితే విదేశాల్లో ఉండే ఓ యువకుడు తన తల్లి ఫోటో పోర్న్ సైట్ లో చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: