అయినప్పటికీ ప్రేమను గెలిపించుకోవడానికి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకుని దంపతులు అద్దె ఇల్లు తీసుకుని కాపురం కూడా పెట్టారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో భార్య ఇంట్లో ఉరి వేసుకుంది. ఇక భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాస్త సంచలనం గా మారిపోయింది. తమిళనాడులోని సేలం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రవి కుమార్ అనే యువకుడు మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. కాగా అదే ప్రాంతంలో ఉండే శరణ్య తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది.
నాలుగు సంవత్సరాల నుంచి శరణ్య రవికుమార్ ప్రేమలో మునిగితేలారు. పెద్దలకు చెబితే వీరి ప్రేమను అంగీకరించలేదు. ఇక పెద్దలను ఎదుటి వారి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై నాలుగు నెలల తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ శరణ్య ఏకంగా అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుంది. అటు రవికుమార్ ఈ విషయం తెలిసి రైలు కింద పడ్డాడు. ఇక అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి