నేటి ఆధునిక సమాజంలో కూడా ఆడపిల్ల అడుగడుగునా భయపడుతూ దుర్భర జీవితాన్ని గడపాల్సిందేనా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న కథనాలు మాత్రం అవును అని చెబుతున్నాయ్. ఎందుకంటే ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు నిత్యకృత్యంగా మారిపోయాయి. అటు ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు కనిపించడం లేదనే చెప్పాలి. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఆడపిల్లగా పుట్టడం మేము చేసిన పాపమా అని అందరు భయపడిపోతున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.


 నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం చేశారు గుర్తుతెలియని దుండగులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి కోఠి నుంచి జూబ్లీహిల్స్ వెళుతుంది. ఈ క్రమంలోనే ఆ యువతి పై కన్నేసిన ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఆటో ఎక్కిన సమయంలో మిగతా మిత్రులకు ఫోన్ చేశాడు ఆటో డ్రైవర్. ఈ క్రమంలోనే యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చివరికి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్  తో పాటు అతని మిత్రులు సైతం అత్యాచారం చేశారు.



 అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘటన మొత్తం వివరించి న్యాయం చేయాలి అంటూ కోరింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులు అఖిల్,నితిన్, ప్రశాంత్, శ్రీను లు అని తేల్చిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక కోఠి నుంచి జిల్లెలగూడ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి వీటి ఆధారంగా నిందితులను పట్టుకున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ప్రస్తుతం జరిగిన ఘటనతో షాక్ లో ఉన్న యువతి దగ్గర నుంచి కొన్ని రోజుల తర్వాత పూర్తి వివరాలు సేకరిస్థానిక చెబుతున్నారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: