హిజ్రాలు ఇప్పటికీ సమాజంలో గౌరవం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది హిజ్రాలు ఆదర్శంగా నిలిచే విధంగా ఎంతో గొప్ప పనులు చేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు  నిర్వహించడం లాంటివి కూడా చేస్తున్నారు. కానీ కొంతమందికి కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తూ ఉంటుంది. దీంతో ఎంతో మంది ప్రజల్లో హిజ్రాలు అంటే ఇప్పటికీ చెడ్డ భావనే ఉంది అని చెప్పాలి. కానీ ఇక్కడ హిజ్రాలు  చేసిన పని తెలిస్తే మాత్రం వారిని  మెచ్చుకోకుండా ఉండలేరు. ఏకంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని హిజ్రాలు కాపాడారు.  యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు బలవంతంగా ఇంట్లోకి దూరి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఒక కామాంధుడు.


 ఈ క్రమంలోనే హిజ్రాలు సదరు యువతిని కాపాడారు అని చెప్పాలి. బెంగళూరు నగరంలోని కెఆర్ పురం లో వివేక నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. కోరమంగళ వద్దనున్న ప్రాంతంలో  పశ్చిమ బెంగాల్కు చెందిన ముసురుల్ షేక్ అనే యువకుడు ఉన్నాడు. అదే ప్రాంతంలో నర్సింగ్ కోర్స్ చదువుకుంటుంది మిజోరాం చెందిన యువతి. ఆమెపై కన్నేశాడు యువకుడు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెపై లైంగిక వాంఛలు తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే సమయం సందర్భం కోసం చూసాడు. అదే ప్రాంతంలో ఒక హోటల్లో పనిచేసే ముసురుల్ షేక్ సదరు యువతి గది డోర్ బెల్ కొట్టి అక్కడినుంచి పారిపోతూ ఉండేవాడు.


 అయితే ఇటీవల తెల్లవారుజామున మాత్రం దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా కాలింగ్ బెల్ కొట్టి గదిలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే భయపడిపోయిన యువతి లైంగిక దాడి చేస్తూ ఉండడంతో కేకలు వేసింది. అయితే అక్కడే సమీపంలో ఉన్న ఇద్దరు హిజ్రాలు  అక్కడికి చేరుకుని యువతిని కాపాడి ఇక అతన్ని పట్టుకున్నారు.  స్థానికులు కూడా ఒకసారి అక్కడికి చేరుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రమాదంలో ఉన్న ఆడ పిల్లను కాపాడిన హిజ్రాలపై స్థానికులు ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: