ఇటీవలి కాలంలో వాట్సాప్ వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. నేటి రోజుల్లో బాధ అయినా సంతోషమైన వాట్సాప్ స్టేటస్  గా పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ వాట్సాప్ స్టేటస్ ఇక్కడ ఒక పెళ్లి ఆగి పోవడానికి కారణమైంది. అదేంటి వాట్సాప్ స్టేటస్ కారణంగా పెళ్లి ఆగి పోవడం ఏంటి అని అవాక్కవుతున్నారు కదా.. ఆ వివరాలు ఏంటో పూర్తిగా  విషయం తెలిసిన తర్వాత మీకే అర్థమవుతుంది.


 సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం పెళ్లి జరుగుతున్న సమయంలో సరిగ్గా తాళికట్టే సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఆపండి అంటూ డైలాగ్ చెప్పి పెళ్ళి ని ఆపడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇటీవలే ఒక యువకుడు విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంకు చెందిన రాజేష్ అనే యువకుడు పెళ్లి జరుగుతూ ఉండగా అక్కడికి ఎంట్రీ ఇచ్చినా అతడి ప్రేయసి షాక్ ఇచ్చింది. బొద్దుల రాజేష్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.. గతంలో రామకృష్ణాపురం లోనే ఉండే రమీనా ఇప్పుడు హుజురాబాద్ లో ఉంటుంది. అయితే ఆమెకు అప్పటికే పెళ్లయింది భర్తతో విడిపోయింది. ఈ సమయంలోనే రాజేష్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది.


 ఇకపోతే ఇటీవలే  రాజేష్ పెళ్లి చేసుకుంటుండగా ఫంక్షన్ హాల్ కి ఎంట్రీ ఇచ్చింది.. ఎనిమిదేళ్లుగా రాజేష్ తనను ప్రేమిస్తున్నాడని శారీరకంగానూ వాడుకున్నాడని... గర్భం దాల్చితే అబార్షన్ కూడా చేయించాడని ఆరోపిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ఇక తనతో రాత్రి వరకు వాట్సాప్ లో చాట్ చేశాడంటూ తెలిపింది. అయితే ఈ పెళ్లి విషయం తనకు తెలియదని రాజేష్ బంధువు ఒకరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కారణంగా పెళ్లి విషయం తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది. అందుకే పోలీసులతో సహా పెళ్లి మండపానికి వచ్చానని చెప్పింది. ఈ ఘటనతో ఇక పెళ్లి కి విచ్చేసిన బంధువులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయం ముందే తెలిసి నందుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు సంతోషపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: