
ఒకప్పుడు కేవలం ఒంటరిగా ఉన్న ఆడ పిల్లలను టార్గెట్ గా చేసుకొని కామాంధులు రెచ్చి పోయి అత్యాచారాలకు పాల్పడటం లాంటి ఘటనలు మాత్రమే వెలుగు లోకి వచ్చేవి. ఇలాంటివి వెలుగు లోకి వచ్చినప్పుడు ఆడపిల్లకు ఎవరైనా తోడుగా ఉండి ఉంటే ఇలాంటి దారుణం జరిగేది కాదేమో అని అనుకున్నారు ఎంతో మంది. కానీ ఇప్పుడు పక్కనే భర్త, అన్న, లేకపోతే స్నేహితుడు లాంటి వారు ఎవరు ఉన్నా సరే కామాంధులు వెనకడుగు వేయడం లేదు. ఏకంగా వారిbపై దాడి చేసి మరీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అత్తారింట్లో గొడవ పడిన ఒక మహిళ పుట్టింటికి వెళ్లడానికి రోడ్డుమీదికి వచ్చింది. అదే సమయంలోనే ఆమె వెనకే వచ్చిన భర్త ఇంకో బంధువు తిరిగి ఇంటికి రావాలి అంటూ బతిమిలాడుతూ ఉన్నారూ. ఇక అదే సమయంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. భర్త బంధువును దారుణంగా చితకబారి మహిళను అక్కడి నుంచి నిర్మాణస్య ప్రాంతానికి ఎత్తుకు వెళ్లారు. చివరికి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ లోని పాలాము జిల్లా పఠాన్ లో వెలుగులోకి వచ్చింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.