
ఆ భర్త అనుమానం పెనుభూతమైంది .. ఆ భార్యను దారుణంగా హత్య చేశారు. తలపై కర్రతో బాది గాజుతో చేయి నరాల కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన హైదరాబాదులోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ లో ఉండే జాకీర్ అహ్మద్ ( 31 ) కు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య నాజియా బేగం ( 30 ) కు ముగ్గురు పిల్లలు. అయితే జాకీర్ తన రెండో భార్యపై అనుమానం పెంచుకున్నారు. నిత్యం వేధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం జల్పెల్లి కొత్తపేట కాలనీకి మకాం మార్చాడు. అనుమానంతో రహస్యంగా భార్య పై నిఘా పెట్టాడు.
ఈనెల 13న రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన జాకీర్ పిల్లల మరో గది లో నిద్రిస్తూ ఉండగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని భార్యను నిలదీశాడు .. ఇద్దరి మధ్య గొడవ జరిగింది .ఆగ్రహం పట్టలేక జాకీర్ కర్రతో భార్య ను తలపై బాదాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీ ్ఇ ఉన్న అద్దాన్ని విరగొట్టి ఓ ముక్కతో ఆమె కుడి చేయి నరాలను కోసేసాడు. అనంతరం చున్నీతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చి పారిపోయాడు. సంఘటన గుర్తించిన ఆమె పిల్లలు జరిగిన విషయాన్ని అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పారు. అక్కడికి నాజియా బేగం తల్లి .. సోదరుడు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు