టీడీపీ శ్రేణులకు బీజేపీపై తీవ్ర కోపం ఉంది. చంద్రబాబు అరెస్టు వెనుక భారతీయ జనతా పార్టీ ఉందని వారి కోపం. అదే స్థాయిలో బీజేపీ కార్యకర్తలకు టీడీపీపై ద్వేషం ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఏన్డీయే నుంచి బయటకు వచ్చిన సందర్భంలో నరేంద్రమోదీ మీద చేసిన వ్యాఖ్యలపై. దీనిని అవకాశంగా మార్చుకునేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆ కూటమిలో లేకపోయినా బీఆర్ఎస్ కూడా ఇదే సమ్మతిని తెలియజేసింది.


రాజ్యసభలో జరిగిన వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు కు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు చేస్తుండగా ఇండియా కూటమి నేతలు ఆయన  ప్రసంగానికి అడ్డు తగిలారు. తద్వారా వారంతా చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారనే విషయం అర్థమైంది.  ఇప్పుడు టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బీజేపీతో కలిసి సాగాలా లేక ఇండియా కూటమితో చేరాలా అనేది.


రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇండియాస్ గ్లోరియస్ ఫేస్ జర్నీ మార్క్ డ్ బై సక్సెస్ఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్-3 అనే అంశంపై మాట్లాడుతూ.. దేశంలో తాము ఎన్నో చేసినట్లుగా బీజేపీ, కాంగ్రెస్  ప్రచారం చేసుకుంటున్నాయి. మధ్యలో మా రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చి సైన్స్ కు తానెంతో చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఎన్నో సార్లు ఆయనే కంప్యూటర్ తయారు చేసినట్లు, అంతరిక్ష పరిశోధనకు ఆధ్యుడనని, సెల్ ఫోన్ తానే కనిపెట్టినట్లు ప్రకటించుకున్నట్లు చంద్రబాబు గురించి ప్రస్తావించారు.  


దీనిపై టీడీపీ ఎంపీ కనకమేడల, బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అడ్డు తగలగా మీ మీట నేను వినదలచుకోలదు దయచేసి కూర్చొంచి అని గదాయించారు. అదే సమయంలో అడ్డు తగిలిన డీఎంకే సభాపక్షనేత తిరుచ్చిసేవ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అరాచక పార్టీ అని మిగిలిన పార్టీలు వారితో కలిసి దేశాన్ని అరాచకం చేస్తున్నాయి అని ఆరోపించారు. దీనిపై వామపక్ష సభ్యుడు స్పందిస్తూ బెయిల్ మీద ఉన్న నాయకుడు జైలులో ఉన్న నాయకుడిని ప్రశ్నిస్తున్నారు అంటూ విజయసాయిపై వ్యంగాస్త్రం సంధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: