భారత్ లో తీవ్ర వాదాన్ని పెంచి పోషించాలని అనుకున్న పాకిస్థాన్ ప్రస్తుతం పూర్తిగా అప్పుల్లో కూరకుపోయి తీవ్ర ఆర్థిక సమస్యలతో అల్లాడుతోంది. అయితే ఇప్పుడు కెనడా ఆ కోవాలోకే వెళ్లాలని అనుకుంటోంది. భారత్ ఎప్పుడూ ఏ దేశాన్ని ఆక్రమించుకోవాలని అనుకోలేదు. కాబట్టి భారత్ ను ముక్కలు చేయాలని చూస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులను తమ దేశ పౌరులని ప్రకటించుకోని మా దేశ పౌరుడైన హర్ దీప్ సింగ్ నిజ్జర్ ను భారత్ ఏజెంట్లు చంపారంటూ ఆరోపణలు చేసింది.


దీనిపై భారత్ తీవ్రంగానే స్పందించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ కూడా తీవ్రవాదులను పెంచి పోషించి నేడు ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తుందో కూడా చూస్తూ కెనడా ఇలా ప్రవర్తించడం ఆ దేశ మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు. నిజ్జర్ హత్యతో పాటుగా మరో ఖలిస్తాన్ తీవ్రవాదిని చంపేస్తోంది. కెనడాలో ఉన్న తీవ్రవాదులు ఎవరెవరూ.. ఎవరూ ఖలిస్థాన్ పేరుతో ఎలాంటి దాడులకు తెగబడ్డారు. ఎంతమందిని చంపేశారు. ఎయే అల్లర్లలో పాల్గొన్నారు అనే వివరాలను ఇండియా బయటపెడుతోంది.


దీంతో కెనడా పరువు ప్రపంచ దేశాల ముంగిట పోతుంది. ఇంతటి దారుణమైన హత్యలు చేసిన వ్యక్తులను కెనడా కాపాడుతోందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కెనడాలో ఉన్న తీవ్రవాది హర్ష్ దాల్ 20 హత్యల్లో నిందితుడు పాకిస్థాన్ నుంచి పారిపోయి కెనడాలో భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నాడు. దాల్ భారత్ లో ఎలాంటి టెర్రరిస్టు పనులు చేపట్టాడు. ఇప్పుడు కెనడాలో ఎక్కడ ఉంటున్నాడు. ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడనే వివరాలతో సహా మీడియాకు ఆధారాలు ఇస్తూ ఇండియా ప్రచారం చేస్తుంది.


దాల్ ఒక్కడే కాదు కెనడా మరో పాకిస్థాన్ లాగా తయారవుతుందని అక్కడ ఎక్కువ మంది ఉగ్రవాదులు ఉన్నారని వారితో ఎప్పటికైనా కెనడాకు ప్రమాదమేనని చెబుతున్నారు. కాబట్టి కెనడా చేస్తున్న పని వల్ల ఆ దేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా ముప్పు ఉందని భారత్ చాటి చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: