తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఈ నెల మొదటి వారంలో తెలంగాణలో ఎన్నికల ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆంధ్రాలో కూడా రాజకీయ వేడి మొదలైనట్లే అనిపిస్తుంది. మరో తొమ్మిది నెలల్లో మరో నూతన ప్రభుత్వం అక్కడ కొలువు తీరనుంది.  ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. వైసీపీ మాత్రం ఒంటరిగా బరిలో దిగనుంది.


జగన్ తీసుకునే నిర్ణయాలు  విమర్శించలేక… సమర్థించలేక సతమతం అవుతూ.. చివరికి అధినేతకు అంతా సవ్యంగా ఉందని చెబుతున్న  వైసీపీ నాయకులకు పీసీ సర్వేస్ ఆఫ్ ఇండియా అనే సర్వే సంస్థ ఊరట కలిగించే అంశాన్ని తెలిపింది. అధికార వైసీపీ 49.5 శాతం ఓట్లు పొంది 135 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. 38.5 శాతం ఓట్లతో 35 సీట్లు సాధించి మరోసారి టీడీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని పేర్కొంది. జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే 5 సీట్లు వస్తాయని తమ సర్వేలో వెల్లడించింది.


సర్వే సంస్థ ఫలితాలు కర్ణాటక లో నిరూపితం అయ్యాయని వైసీపీ చెబుతోంది. ఉత్తర్ ప్రదశ్, మధ్య ప్రదేశ్ లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ సంస్థ సర్వే అంచనాలు తలకిందులయ్యాయని టీడీపీ వాదిస్తోంది. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో 24-25 ఎంపీ స్థానాలు వైసీపీ కి వస్తాయని తెలిపింది.  ఇండియా టుడే సర్వే చేస్తున్న ఓ వ్యక్తి ఓ చోట మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో టీడీపీ తప్ప మరే పార్టీకి రెండు అంకెల ఎంపీలు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు టీడీపీ ఎన్డీయే కూటమిని విభేదించి బయటకు వచ్చేసింది అని ఆ పార్టీకి 15-20 స్థానాలు వస్తాయని తెలిపాడు. ఇప్పుడు టీడీపీ ఇదే విషయాన్ని తీసుకొని ప్రచారం చేస్తోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: