గతంలో కాంగ్రెస్ హయాంలో మత కలహాలు, నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తేవి. ఇవి కాంగ్రెస్ పేటేంట్ లా ఉండేవని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇవన్నీ వస్తాయి అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చారు.


గతంలో లగడపాటి రాజగోపాల్, నన్నపనేని రాజకుమారి ఏ అంశాలు అయితే ప్రస్తావించారో.. ప్రస్తుతం సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు అవే అంశాలు పట్టుకొని మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఏపీలో పాలకులు తమ ఆధిపత్యం పోతుంది. తమ అధికారం కోల్పోతామనే భావనతో కిరణ్ కిమర్ రెడ్డి కరెంట్ సమస్యలు తీసుకువచ్చారు. నన్నపనేని రాజకుమారి శాంతి భద్రతల అంశం, కుమ్ములాటలు ఉంటాయని.. నక్సలిజం పెరుగుతుంది అని రాజగోపాల్ లు తెలంగాణ విభజన సందర్భంగా వ్యాఖ్యానించారు.

 
మళ్లీ అవే వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. మనుషులు మారారు. మాటలు మారలేదు. ఎందుకంటే అధికారానికి దూరం అవుతారనే భావనతోనే బీఆర్ఎస్ నాయకులు ఈ తరహా ప్రచారానిని తెర తీశారు. మళ్లీ ఈ అంశాలను రెచ్చ గొట్టి గెలవాలని  చూస్తున్నారు. అయితే 2004 నుంచి 2014 కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం బాగానే వృద్ధి చెందింది. పెట్టుబడులు పెరిగాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తలేదు.


ఓటర్ రింగురోడ్డు, మెట్రో రైలు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, అంతర్జాతీయ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెడికల్  హబ్ లు ఇవన్నీ కాంగ్రెస్ ల్యాండ్ మార్కులుగా మేం చెప్పుకుంటాం. అలాంటి ల్యాండ్ మార్క్ డెవలప్ మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందా అని ప్రశ్నించారు.   కాంగ్రెస్ వస్తే అది చేస్తది అని భయపెట్టే బదులు ఇప్పటి వరకు మీరేం చేశారో చెప్పాలి కదా.  మా హయాంలో ప్రవేశపెట్టిన ఐటీ ఎగుమతుల విధానాలతోనే ఈ రోజు సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో బెంగళూరును దాటారు తప్ప వాళ్ల స్వయంకృషి ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr