పైస, రెండు పైసలు, మూడు పైసలు అనేవి ఇప్పుడున్న కాలం వారికి అంతగా తెలియవు. మూడు తరాల అనుభవాలను ఒకే తరం అనుభవిస్తే ఎలా ఉంటుంది. 1970, 80లలో పుట్టిన వారికి ఇది చాలా బాగా తెలుసు ఎలాగంటే ఒక పైస, రెండు పైసలను చూశారు. ఇప్పుడు అదే తరం మనిషి అన్ని నోట్ల కట్టలనే లెక్కపెట్టడం చూస్తున్నారు. ఇలాంటి మూడు తరాలను చూసిన ఓ మిత్రుడు ఒక మంచి సందేశాన్ని రాశాడు. అదేంటో చూద్దాం..


స్టార్ హోటళ్లో బోర్న్ విటా తాగినా.. చెరుకు గడ తిన్నా తీపి రాదు. నేడు చేతిలో ఐఫోన్ నలుగుతున్న సరే.. నాటి అగ్గిపెట్టెలో హలో అన్న హాయి లేదు. మిగిలినా కాస్త జుట్టుకు ఖరీదైన జల్ పూస్తున్న కొబ్బరి నూనె మెరుపేది. నేటి రూ.150 ఐస్ క్రీం నోట్లో కరుగుతున్నా.. నాటి 15 పైసల ఐస్ క్రీం ముందు చల్లదనమేది? కళ్లేదుట 500 ఛానళ్లు ఉన్నా.. నాటి దూరదర్శన్ చిత్ర లహరి నిరీక్షణ ఉత్కంఠ ఎక్కడ కనిపిస్తుంది. ఓటీటీ వంద సినిమాలు సరే ఎడ్ల బండి మీద చూసొచ్చిన మాయబజార్ చాయలు ఇప్పటి తరానికి తెలుయునా. కివీ ప్రూట్స్ తినేవారికి బడి వెనక ఏరుకుతిన్నా రేగు పండ్ల ఒగరు తెలుసా..


ఆడి కారు..లగ్జరి కారు అయినా సరే.. గంటకు కిరాయి సైకిలు తొక్కినా అనుభూతి ఇప్పుడున్నా యువతకు లేదు. నాటి బ్లాక్ అండ్ వైట్ టీవీ ముందు నేటి స్మార్ట్ టీవీలు బలాదూర్.. పబ్జీ ఆడుతున్నాం.. నాటి చిర్రెగోనే ఆడినా ఉత్సహామే లేదు. బాగా ఎదిగాం.. ఎదుగుతున్నాం. అయినా ఎదో కోల్పోతున్నాఅసంతృప్తి, మట్టి వాసనల నుంచి మస్తు  వైవిద్యాల దాకా ఎదిగొచ్చిన తరం ఒక వైపైతే. సకల సదుపాయాల కోసం పరుగులు పెడుతూ.. చిన్న పాటి సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న తరం మరో వైపు.  పిల్లల్ని కంటే పోషించాల్సి వస్తుందనుకుని పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే ఈ తరంలో వస్తున్న అసలైన మార్పు.


మరింత సమాచారం తెలుసుకోండి: