ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ భావించారు. తెలంగాణలో బీజేపీకి, టీడీపీకి పవన్ జనసేన పార్టీ ఆఫరిచ్చారు. తెలంగాణలో టీడీపీ, జనసేనతో పొత్తుకు అనుకూలంగానే ఉంది. కానీ ఇక్కడ బీజేపీ సిద్ధంగా లేదు. బీఆర్ఎస్ అయితే ఎలాగూ జనసేనతో పొత్తు పెట్టుకోదు. ఆ అవసరం కూడా వారికి లేదు.  7 నుంచి 14 దాకా ఎంపీ స్థానాలు, 10 నుంచి 20 వరకు ఎమ్మెల్యే స్థానాల్లో తెలంగాణలో పోటీ చేయాలని పవన్ అనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎలాగో చేర్చుకోలేదు. ఓట్లు చీల్చడానికి ఇలాంటి పార్టీలు పనికొస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది.


తెలుగుదేశం పార్టీతో అయితే బీఆర్ఎస్ అస్సలు పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ కూడా టీడీపీతో అసలు పొత్తు పెట్టుకోదు. 2018లో కూడా కాంగ్రెస్, తెదేపాలు కలిసి పోటీ చేయడంతో దాన్ని అప్పటి టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా చేసుకొని చంద్రబాబు మళ్లీ తెలంగాణకు రావాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ కేసీఆర్ ప్రచారం చేశారు. దీంతో ఏకపక్షంగా టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీ బలంగా మారింది. దీనికి జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనసేన మాత్రం తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది.


పోటీలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కాస్త అంతర్గత కుమ్ములాటలో బీజీగా మారిపోయింది. దీన్ని కవర్ చేస్తూ బీజేపీ ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ అనుకుంటున్న తరుణంలో జనసేన తెలంగాణలో ఏ మేరకు రాణిస్తుంది. జనసేన, టీడీపీలు ఈ రాజకీయ వేడిని తట్టుకుని ఎమ్మెల్యే స్థానాల్లో గెలవగలవా.. వీరి కలయిక ఎలా మారుతుందో చూడాలి. వీరు చీల్చే ఓట్లు ఏయే ప్రాంతాల్లో ప్రభావం చూపతాయో ఎక్కడెక్కడ వీరికి బలమైన ఓటింగ్ శాతం ఉంటుందో ఎవరి మీద వీరి ప్రభావం ఉండనుందో ఎన్నికల నాటికి తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: