రష్యా, ఉక్రెయిన్ రోజు రోజుకు బీభత్సంగా మారిపోతుంది. దీని వల్ల ఎంతో మంది సైనికులు మరణిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం ఇంకా యుద్దం కొనసాగిస్తాం. అమెరికా, బ్రిటన్ మాకు ఆయుధాలు ఇస్తామని చెప్పింది. వాటితో రష్యా పని పడతాం అని అనుకుంటున్నాడు. కానీ బ్రిటన్, యూరప్ దేశాలు ఇస్తున్న ఆయుధాలు రష్యాపై  ఏ మాత్రం పని చేయడం లేదు.


ఎందుకుంటే అవి పాత కాలం నాటివి.. అప్ డేట్ వర్షన్ లేని ఆయుధాలను ఇవ్వడం వల్ల రష్యా పని చాలా తేలిక అవుతుంది. దీని వల్ల రష్యా అలవోకగా ఉక్రెయిన్ లోని టార్గెట్ లను ఛేదిస్తోంది. బ్రిటన్ ఆర్మ్ డ్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానాన్ని రష్యా తన యుద్ధ విమానంతో పేల్చేసింది. అలాగే ఉక్రెయిన్ లోని 83 మంది సైనికులను మట్టుబెట్టింది. ఇంత జరుగుతున్న ఇంకా యుద్ధంలో గెలిచి తీరతాం అని గొప్పలకు పోతున్నాడు జెలెన్ స్కీ.


రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు దూసుకుపోతూనే ఉంది. మొన్నటికి మొన్న రష్యా వేసిన ఒక బాంబు వంద బాంబులతో సమానం అన్నట్లు ఉంది. దీంతో చుట్టూ పక్కల నగరాలే కంపించాయంటే ఎంతటి పవర్ ఫుల్ బాంబును వేశారో అర్థం చేసుకోవచ్చు. రష్యా పై యుద్ధంలో గెలవాలని కోరుకోవడం ఉక్రెయిన్ చేస్తున్న పొరపాటే అనుకోవచ్చు.


5 వేలకు పైగా అణు బాంబులు ఉన్న దేశం యుద్ద రంగంలోకి దిగితే ఎక్కడైనా తగ్గుతుందా.. ఓడిపోయినా పర్లేదు. ఉక్రెయిన్ పని పట్టాలనే పుతిన్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. దీని వల్లే 30 దేశాలు ఉక్రెయిన్ కు సపోర్టు చేస్తున్నా ఏడాదిగా ఒంటరిగానే పోరాటం కొనసాగిస్తున్నాడు. ఒక 30 వైపు  దేశాలు, మరో వైపు పుతిన్ అన్నట్లు సాగుతుంది. ఈ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ వద్ద మిగిలిపోయిన పాత ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇస్తూ యుద్ధం చేయమనడం ఎంత వరకు సబబో ఆ దేశాలు ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: