మామూలుగా మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు కానీ, బయట ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏదైనా వస్తువు గాని, డబ్బు గాని దొరికితే ఏం చేస్తాం, సాధారణంగా దాని తాలూకా మనుషులు ఎవరైనా ఉన్నారేమో చుట్టూ చూస్తాం. ఎవరూ లేనప్పుడు ఇంక చేసేదేమీ లేక ఆ వస్తువును లేదా డబ్బును తీసుకుంటాం. దానికి నీతి నిజాయితీలతో సంబంధం ఉండదు. అయితే దొరికిన వస్తువు సంబంధించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ గానీ దొరికితే కొంతమంది తిరిగి వస్తువుని నిజాయితీగా ఇచ్చేయడం అనేది జరుగుతుంది.


ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే  నీతి నిజాయితీలకి మారుపేరుగా జపాన్ మళ్లీ ప్రపంచంలో పేరు సంపాదిస్తుంది. ఇక్కడ మనం ఏదైనా హోటల్ కి వెళ్తే 60% తిని, 40% వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జపాన్ లో ఆహారాన్ని అలా వృధా చేస్తే ఊరుకోరు. పనిష్మెంట్లు  గట్టిగానే ఉంటాయి. ఇలా జపాన్ పద్ధతికి పేరుగా మారింది. ముఖ్యంగా అక్కడ ఏదైనా వస్తువును పోగొట్టుకుంటే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. తర్వాత అది నేరుగా తమ ఇంటికి వస్తుంది.


అక్కడ మనం పర్స్  మర్చిపోయినా, ఇంకేం పోగొట్టుకున్నా అది నేరుగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. దానికి కారణం అక్కడ నిజాయితీగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరగడమే. లాస్ట్ ఇయర్  టోక్యోలో 14మిలియన్ల ఫోన్లు పోగొట్టుకుంటే అవి తిరిగి మళ్లీ సొంతదారులకు చేరుకున్నాయి. 28మిలియన్ డాలర్ల సొమ్ము కూడా అలానే రిటర్న్ అయింది. ఏదైనా తమ విలువైన వస్తువును లేదా డబ్బును పోగొట్టుకున్నామని, పోగొట్టుకుంటామనే బాధ, ఆలోచన అక్కడ ఎవరికీ కలిగే పరిస్థితి అయితే లేదు.


అంత నిజాయితీతో ఉంటున్నారు అక్కడ జనం. అలా టోక్యోలో పోగొట్టుకున్న సొమ్ము 88% రిటర్న్ అయ్యిందట. అదే సందర్భంలో అమెరికాలో నిజాయితీ చూస్తే కేవలం 8శాతం మందే పోగొట్టుకున్నది తిరిగి సాధించుకున్నారు. చివరికి అక్కడ చిన్న పిల్లలు కూడా ఎంతో నిజాయితీగా ఉండడం జపాన్ భావితరానికి గొప్ప ఊతం.

మరింత సమాచారం తెలుసుకోండి: