కేటీఆర్ తాజాగా మాజామంత్రి మల్లారెడ్డి ఉండేటువంటి జవహర్ నగర్ కి వెళ్లారు. అక్కడ అంతా సరదాగా సాగినా మల్లారెడ్డి మాత్రం సరదాగా నవ్వుతూనే కేటీఆర్ కి జలక్‌ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు బాగుండవు. తెలంగాణలో అద్భుతంగా ఉంటాయన్న దానికి సమాధానం గా కేటీఆర్ ని వేదిక దగ్గరికి ఒక చెత్త రోడ్ల నుండి తీసుకెళ్లారు ఆయిన. దాంతో కేటీఆర్ వేదికపై నుండి ఆ రోడ్లను బాగు చేయించుకోండి అనేలా చేసుకువచ్చారు.


అంటే మల్లారెడ్డి ఇలా చెత్త రోడ్ నుండి తీసుకెళ్లడం ద్వారా కేటీఆర్ కి జలక్ ఇచ్చి రోడ్లు వేయించమని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లు అయిందని, అంటే తెలంగాణలో రోడ్లన్నీ బాగున్నాయనే మాటలో వాస్తవం లేదని ఈ సంఘటన ద్వారా తేలుతుందని కొంతమంది అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ పార్కు కట్టండి, ఒక డంపింగ్ యార్డ్ పెట్టండి ప్రజలంతా అల్లాడిపోతున్నారు అంటూ మేము మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు అంటూనే వరుస పెట్టి కోరికలు కోరుతున్నారు ఆయన.


ఇక్కడ మల్లారెడ్డి భోళాగా మాట్లాడటం ద్వారా కేటీఆర్ ని ఇరకాటంలో పెట్టారని తెలుస్తుంది. అయితే అపర చాణక్యుడు కెసిఆర్ బిడ్డ అయినటువంటి కేటీఆర్ దాన్ని చాలా చాతుర్యంతో సరిదిద్దినట్లుగా తెలుస్తుంది. దానికి తెలివిగా కేటీఆర్ మల్లారెడ్డి తో మీరు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి కదా. మీరు పాలు, పూలు, ఇంకా కూరలు అమ్మి పైకి వచ్చిన వ్యక్తి కదా‌. మీకు మాత్రం తెలీదా. మీరు కూడా కొంత ఖర్చు పెట్టండి. రోడ్లు బాగు చేయించుకోండి మిగతావి చూద్దాం అని ఆయన అన్నట్లు తెలుస్తుంది.


అంటే మల్లారెడ్డి ఆ సమస్యలకు నిధులు ఇండైరెక్టుగా అడుగుతున్న సందర్భంలో కేటీఆర్ ఇస్తామంటూనే కొంత ఆయన్ని కూడా ఖర్చు పెట్టమనడంతో జనంలోకి నెగిటివ్ వెళ్లకుండా  వ్యవహరించడం ద్వారా కేటీఆర్ కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించారని తెలుస్తుందని మరికొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: