'వెనుపాటు' అంటే గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు పేరు. గతంలో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు అనే నింద అప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు మోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన బావ, వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ తనకు వెన్నుపోటు పొడుస్తున్నాడనే భయం, బాధ చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, మొదటిసారిగా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 


ఇక అప్పటి నుంచి పార్టీలో బాలయ్య తన హవా పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ సొంతంగా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ, తన బావ చంద్రబాబుకి ఏదో ఒక సమయంలో ప్రత్యామ్నాయం తానే అవుతాను అన్నట్టుగా బాలయ్య వ్యవహరిస్తూ ఉండేవారు. అంతే కాకుండా తనకు సన్నిహితులైన వారికి, అనుకూల వర్గం అయిన వారికి టికెట్లు, పదవులు ఇప్పించడంలో బాలయ్య సక్సెస్ అయ్యారు. ఇక బాలయ్య సూచించిన వారికి కూడా చంద్రబాబు అదే రకంగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులు బాగా మారాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు, తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. 


ఇక రెండోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య అప్పటి నుంచి మౌనంగానే ఉంటున్నారు. అసెంబ్లీలో తెలుగుదేశంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నా బాలయ్య నోరు మెదపడం లేదు. ఇక అమరావతి ఉద్యమం, ఇసుక ఆందోళన ఇలా అన్ని విషయాల్లోనూ బాలయ్య ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ముందుకు రాలేదు. ఇక గతంలో తాను టిక్కెట్లు ఇప్పించుకుని పదవులు ఇప్పించిన నాయకులు ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నా, బాలయ్య వారిని కట్టడి చేయకపోవడంతో తెలుగుదేశం పార్టీలో బాలయ్య వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. 


మరీ ముఖ్యంగా బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు నిన్న ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కదిరి బాబురావు బాలయ్య కు అత్యంత సన్నిహితుడు. బాలయ్య నిర్ణయం లేకుండా ఆయన ఏ పని చేయడు. అటువంటిది ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం, ముందుగానే ఈ విషయం పై బాలయ్యతో చర్చించడం, ఆయన అనుమతితో వైసీపీలోకి వెళ్లడం తదితర పరిణామాల గురించి చంద్రబాబుకు సమాచారం అందడంతో ఇప్పుడు ఆయన వ్యవహారంపై తీవ్రస్థాయిలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు తెలుస్తోంది. 


గతంలో టిడిపిలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తెలుగుదేశం పార్టీని వీడి బిజెపిలో చేరిన తరువాత తాను బాలయ్యకు పార్టీకి రాజీనామా చేస్తున్నాని ముందే చెప్పానని, ఆయన అనుమతితో బిజెపిలో చేరానని ప్రకటించారు. ఇప్పుడు అదే రకంగా కదిరి బాబురావు కూడా వైసీపీ కండువా కప్పుకోవడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీని బలోపేతం చేయడం మానేసి వైసీపీలోకి వలసలు ప్రోత్సహిస్తున్నాడు అంటూ బాలయ్య వ్యవహారంపై తన సన్నిహితుల వద్ద చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తనకు బాలయ్య వెన్నుపోటు పొడుస్తాడనే భయం చంద్రబాబు లో ఎక్కువగా కనిపిస్తున్నట్టు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: