ఈటల రాజేందర్‌కు ఇటీవల కేసీఆర్ చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీలోనే ఉంటూ.. పార్టీకి ద్రోహం చేస్తున్నారని కేసీఆర్ నిర్ణయించుకున్న తర్వాతే ఆయనపై వేటు పడిందని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అందులో వాస్తవం ఎంతో తెలియదు. అయితే.. ఈటల రాజేందర్ బర్తరఫ్ రచ్చ చల్లారకముందే కొన్నిరోజుల క్రితం టీఆర్ఎస్‌లో మరో తుపాను విషయం బయటపడింది. కర్ణాటకలోని హంపిలో జరిగిన ఓ విందు పార్టీ అంశం గులాబీ పార్టీలో కల్లోలం రేపింది.

పొలిటికల్ సర్కిళ్లో బాగా ప్రచారమైన ఆ అంశం ఏంటంటే.. మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా కొన్నాళ్ల క్రితం కర్నాటక హంపిలో పార్టీ ఏర్పాటు చేశారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్యులు  పార్టీకి హాజరయ్యారు. కాస్త మందు తలకెక్కిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ పాలన పై మండిపడ్డారట. కేసీఆర్ పాలన పూర్తిగా కుటుంబమయం అయ్యిందన్నారట. మొత్తం అధికారం అయ్యా కొడుకుల దగ్గరే ఉందని ఒక్కొక్కరుగా రెచ్చిపోయారట.

ఇదంతా కొందరి ద్వారా హరీశ్ రావుకు తెలిసిందని.. ఆయన దాన్ని కేసీఆర్‌కు చెప్పారని.. అందుకే ఈటలను అర్జంటుగా పార్టీ నుంచి పంపారని పుకార్లు వచ్చాయి. అయితే ఈ ఘటనపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. కానీ త్వరలోనే జగదీశ్ రెడ్డికి ఉద్వాసన తప్పదని వందతులు వచ్చాయి. తనను తిడుతున్నా ఆయన వారించలేదని జగదీశ్ రెడ్డిపై కేసీఆర్ కోపంగా ఉన్నారని.. త్వరలోనే మంత్రి వర్గం నుంచి ఆయన్ను పంపేస్తారని జోరుగా ప్రచారం సాగింది.  

అయితే.. ఈ వార్తలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదు. అంతే కాదు.. ఈటల బీజేపీలో చేరుతున్న సమయంలో ఆయన్ను తిట్టే బాధ్యతను జగదీశ్ రెడ్డికే అప్పగించారు. అంటే.. ఈ హంపి కథనాన్ని కేసీఆర్ నమ్మలేదని అనుకోవచ్చా.. లేక.. నమ్మినా మంత్రి జగదీశ్ రెడ్డిని కేసీఆర్ క్షమించారా.. మొత్తానికి మంత్రి జగదీశ్ రెడ్డి పదవి మాత్రం సేఫ్ అని ఈ ఘటనతో తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: