జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర చాలా తక్కువనే చెప్పాలి. ఒక్క పీవీ నరసింహారావు మాత్రమే ప్రధాన మంత్రి స్థాయి అందుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్లే సాధ్యమైంది. జాతీయ రాజకీయాలల్లో కీలక పాత్ర పోషించాలని గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు కొంత వరకూ ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్‌ నేషనల్ ఫ్రంట్‌ కన్వీనర్ అయ్యారు. చంద్రబాబు కూడా అదే స్థాయి అందుకున్నారు. కానీ.. ఆ తర్వాత పెద్దగా తెలుగు వారు ఆ స్థాయికి వెళ్లలేదు.


కానీ ఇప్పుడు కేసీఆర్ మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రాజకీయాలు అంటూ కలలు కంటున్నారు. అయితే.. కేసీఆర్‌కు అంత సీన్ లేదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. తెలంగాణ ప్రజలను ఫేస్ చేసే దమ్ము లేకనే జాతీయ రాజకీయాలు అంటుండని.. గతంలో జాతీయ రాజకీయాల్లో వెలుపెట్టిన ఎన్టీఆర్, చంద్రబాబు పరిస్థితి ఏంటో ప్రజలు చూసారని
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో వెలుపెట్టిన చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పట్టనుందన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మంత్రులు కారుకూతలు బంద్ చెయ్యాలన్నారు.


మోడీకి కాదు.. ప్రధాని చైర్ కు గౌవరం ఇవ్వాలని అని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గుర్తు చేశారు. మరి ఇవ్వాళ ప్రధానిని వ్యక్తిగతంగా కేసీఆర్ విమర్శ చేస్తున్నారని.. ప్రధాని పర్యటన ఉందని..మోడీకి మొఖం చూపించే దమ్ము-ధైర్యం లేఖ పారిపోయారని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేజ్రీవాల్ కు కమిట్మెంట్ ఉంది కాబట్టే విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించారని.. కానీ..  కేసీఆర్ కు ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు.. అందుకే ప్రగతి భవన్ చుట్టూ ముళ్ల కంచెలు వేసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.


సీఎం ఫామ్ హౌస్ వస్తుంటే రోడ్డంతా బంద్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ ఆలోచించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. కేసీఆర్ వల్ల తెలంగాణ ధనిక రాష్ట్రం దివాలా తీసి.. అంధకారంలోకి వెళ్ళిందని.. చివరకు కాగ్ నివేదికలు బయటకు రాకుండా దాచిపెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: