అన్నట్టుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. తన రాజీనామా పత్రాన్ని అంద చేశారు. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేస్తున్నానని  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందన్న  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి .. ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారని.. కానీ.. నేడు కేసిఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తుందని మండిపడ్డారు.


నేను రాజీనామ చేస్తున్నానంటే కేసిఆర్ దిగి వస్తున్నారని.. నా రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారని  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి  అంటున్నారు. తెలంగాణకు కేసిఆర్ నుంచి విముక్తి కల్పిస్తారని.. పడుకుంటే లేస్తే మునుగోడు ప్రజలు గుర్తు రావాలని..  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఎద్దేవా చేశారు. నన్ను గెలిపించి ప్రజలు పాపం  చేశారా.. అభివృద్ది కోసం కేసిఆర్ ను కలువాలని చూస్తే అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. ఉప ఎన్నిక పై ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఉప ఎన్నిక వస్తోంది.. స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరు..నా మునుగోడు ప్రజల పై ఉన్న నమ్మకం తో రాజీనామా చేసి తీర్పు కోరుతున్నానన్నారు  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి .


ధైర్యం లేకపోతే నేను ఈ పని చేసే వాడిని కాదు.. నా పై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది నా కోసం చేసే యుద్ధం కాదు.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉంది.. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం కోసం, పేదలకు ఇళ్ల కోసం, పెన్షన్ ల కోసం  రాజీనామా చేస్తున్నానని  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి  అన్నారు. నేను రాజీనామా అనగానే గట్టుప్పల్ మండలం వచ్చిందని.. సీఎం కు సిరిసిల్ల సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదని  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి  మండిపడ్డారు.


ప్రాజెక్టులు కట్టొద్దని మేము చెప్పలేదన్న  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి .. లక్ష రుణ మాఫీ ఏమైందని ప్రశ్నించారు.  వరి కొనలేమని చేతులు ఎత్తేశారని.. మిషన్ భగీరథలో 25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా.. జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని.. గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులా అంటూ  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి  ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం లేదన్న  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి .. స్పీకర్ నా రాజీనామ ఆమోదిస్తారు అనుకుంటున్నానన్నారు. మరి ఈ రాజీనామాను పోచారం ఏం చేస్తారో? ఆమోదిస్తే మరో రాజకీయ సమరం తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: