
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పక్క దేశాల వాళ్ళు చొరబడకుండా సోలార్ ఫెన్సింగ్ వేశారు. బంగ్లాదేశ్ లో తినడానికి తిండి లేక, ఆ దేశంలో బ్రతకలేక, భారతదేశంలో అయితే ఉపాధి అవకాశాలు ఉంటాయని, వాటిని దాటుకుని అవసరమైతే బి.ఎస్.ఎఫ్ సైన్యంపై దాడి చేసి మరీ ఇండియాకి వచ్చేస్తున్నారు. వాళ్ల దేశంలో వేరే మతం వాళ్లు బ్రతకడానికి అవకాశం లేక, మన దేశం వైపు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చాక హిందువులను చంపడం లేదా హిందువులపై దాడి చేయడం అలవాటైపోయింది.
బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో బీ.ఎస్.ఎఫ్ సరిహద్దు భద్రతా బలగాలకు సంబంధించిన ఇద్దరు జవాన్స్ బంగ్లాదేశ్ గ్రామస్తుల నుండి తీవ్ర దాడులను ఎదుర్కొన్నారు. నిర్మలాంచల్ సరిహద్దు ఔట్‌పోస్టు సమీపంలో, తమ పశువులను సరిహద్దు దాటి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు 35వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్ల పై బంగ్లాదేశ్ రైతులు దాడి చేశారు. బంగ్లాదేశ్ గ్రామస్తులు జవాన్ల ఆయుధాలను కూడా లాక్కున్నారని బీ.ఎస్.ఎఫ్ తెలిపింది.
ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దులో ఇంత జరుగుతుంటే ఆ బంగ్లాదేశ్ సరిహద్దుకు సంబంధించిన సైనికులు మాత్రం చోద్యం చూస్తున్నట్టుగా ఏమీ చేయకుండా నిలబడిపోయారట. బంగ్లాదేశ్ సరిహద్దు గార్డ్‌లపై సమస్యను లేవనెత్తి ఫ్లాగ్ మీటింగ్‌కు పిలుపునిచ్చింది. ఆ బంగ్లాదేశ్ సైనికులు బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టి పంపిస్తున్నారో, లేదంటే కావాలని పంపిస్తున్నారో తెలియడం లేదు. ఈ విషయం మీద రెండు దేశాల మధ్య మీటింగ్ జరగాలని భారత కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.