ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే అది జనాలు నమ్మేలా ఉండాలి. రాజకీయ నాయకుల సంగతి సరే సరి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గతంలో జగన్ కి సంబంధించి 1500కోట్ల లోపు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అది లక్ష కోట్లు అంటూ మాట్లాడింది తెలుగుదేశం పార్టీ. వెంటనే వైయస్సార్సీపీ వాళ్లు చంద్రబాబుకు సంబంధించి ఆరు లక్షల కోట్లు అంటూ ఆరోపణ చేశారు.


అయితే ఇవన్నీ పై పైన మాటలే కానీ ఎవరు ఒకళ్ళపై మరొకరు చర్యలు తీసుకోరన్నట్లుగా తెలుస్తుంది అంటున్నారు కొంతమంది జనం. కేవలం ప్రచారం కోసమే వీళ్ళు ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటారన్నట్లుగా అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది అదే కాబట్టి. అసలు మనం చెప్పే దాంట్లో యదార్థం ఉంటే, అది యదార్థమని ప్రజలు గ్రహిస్తే అప్పుడు ఆ చెప్పిన మాట లో నిజం ఎంత ఉంది అనే దానిని బట్టి ప్రజలు వాటిని నమ్మడం జరుగుతుంది.


అమరావతి విషయంలో కేంద్రం ఇచ్చిన రెండున్నర వేల కోట్లు ఇంకా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం షూరిటీతో ఇచ్చిన 71/2వేల కోట్ల రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వం కట్టేలా పదివేల కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తుంది. రాజధాని ప్రాంతమైన అమరావతిలో 43 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టి వెళ్లిపోయారు. అది కూడా ఫస్ట్ ఫేజ్ 10% చొప్పున మోబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చి వెళ్లిపోయారట.


అయితే ఆ ప్రభుత్వంలో ఐదు శాతం 10 శాతం అయిన పనులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్లు ప్రచారం ఏమిటంటే రాజధాని పేరుతో 60,000 కోట్లు దుర్వినియోగం చేశారని అంటున్నారు. అసలు సభలో చర్చలతో సంబంధం లేకుండా 27 వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారని వాళ్ళు అడుగుతున్నారట. ఎంత ఖర్చు అయ్యింది  దేవుడికే తెలియాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: