
అయితే మూడు నెలల పాటు కాస్త సైలెంట్ గా ఉన్న ప్రతిపక్షాలు టీడీపీ అనుకూల మీడియా అనంతరం తిరిగి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ డ్యామేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. దీంతో సీఎం జగన్ రాజకీయ మీటింగ్ లల్లో టీవీ5, ఆంధ్రజ్యోతి మన అసలైన ప్రతిపక్ష పార్టీలు వాటి ని ఎదుర్కోవాలి అని పార్టీ కార్యకర్తలు కు పదే పదే చెబుతున్నారు.
ఇన్ని రోజులు సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్లిన జగన్ రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓ కీలక సంస్థకు చెందిన రూ.790 కోట్ల ఆస్తులను సీఐడీ జప్తు చేసేసింది. ఆ సంస్థలో అక్రమ లావాదేవీలు చేస్తున్నారనే అభియోగం పై కేసులు నమోదు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి వారికే సాధ్యం కానీ పనిని జగన్ చేస్తున్నారు. గతంలో ఆ సంస్థను టచ్ చేయాలంటేనే భయపడే వారు. అలాంటిది ఆ సంస్థ అక్రమాస్తుల కేసులో ఏకంగా విచారణ జరిపించారు.
ఆరోగ్యం బాగా లేకున్నా వైద్య సిబ్బింది వెళ్లి మరీ టెస్టులు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మరి జగన్ తీసుకుంటున్న ఈ చర్యలతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోతుందా లేక ఎదురుదాడికి దిగుతుందా చూడాలి. ప్రస్తుతం జగన్ ఒంటరి పోరాటమే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే ఆయనపై కేసుల గొడవ ఉండదు. లేకపోతే మళ్లీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు.