చంద్రబాబు తాజాగా గుడివాడలో రావికి, వెనుగండ్లకు వివాదం ఉంటే దాన్ని పరిష్కరించారు. వెనుగండ్లను పిలిచి మాట్లాడారు. అతనికే టికెట్ ఇచ్చేలా కనిపిస్తోంది. చిలూకరిపేటలో పత్తిపాటికే టికెట్ ఇస్తామని అన్నారు. ఇలా తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను టికెట్లను ఇస్తామని చెప్పేస్తున్నారు. మరో వైపు బస్సు యాత్ర, మహిళ శక్తి, లోకేశ్ పాదయాత్ర అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు.
అదే సమయంలో జనసేన కేవలం పవన్ పైనే ఆధారపడి వారాహి యాత్ర సాగుతోంది. అటు వారాహి యాత్ర కొనసాగుతుండగానే ఇటు టీడీపీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసేసుకుంటోంది. మరో వైపు పవన్ ఆగ్రహంతో వాలంటీర్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం మాత్రం వాలంటీర్లను మేం వస్తే తీసేయం అని చెబుతోంది. పవన్ మాత్రం జనసేన అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తాం అని ప్రకటిస్తున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మాత్రం దానికి టీడీపీకి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ అదే సమయంలో జనసేన గెలిచినా, ఆయన వ్యాఖ్యల వల్ల టీడీపీకి లాభం చేకూరినా రెండు రకాలుగా చంద్రబాబు సక్సెస్ అయినట్లే. కాబట్టి చంద్రబాబు నాయుడు సరైన వ్యుహాంతో రాబోయే ఎన్నికలకు వెళుతున్నారు. కానీ పవన్ మాత్రం పొత్తుల విషయం తెలియక వాలంటీర్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు చాణక్యమా.. పవన్ దూకుడా వచ్చే ఎన్నికల్లో తేలిపోనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి