
ఆయన సైలెంట్ కావడానికి కారణాలేమిటి? ఇప్పటికే ఆయన్ని 52 రోజులు జైల్లో పెట్టడం వల్ల ఆయనకు ప్రజల్లో ఎక్కువగా సానుభూతి వచ్చింది. ఇంత పెద్ద వయసులో జైల్లో పెట్టడానికి గల కారణం. ఆయన నిజంగానే అవినీతి చేశాడా? జైల్లో ఆయనకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకపోవడం తదితర సమస్యలు ప్రజల వద్దకు టీడీపీ నేతలు తీసుకెళ్లగలిగారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ బయటకు వచ్చి కూడా జైల్లో తనను స్పూన్ కూడా ముట్టుకోనీయలేదు. చేతులతో నే తినాల్సి వచ్చింది.
కనీసం సౌకర్యాలు ఇవ్వలేదు అని అంటే దానికి ప్రతిగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తారు. ఇక్కడ కూడా ఆయనకే లాభం చేకూరుతుంది. అయినా ఆయన మౌనం ఎందుకు వహిస్తున్నారో వైసీపీ నేతలకు అంతు చిక్కడం లేదు. వైసీపీ నేతలను ఎలా బురిడీ కొట్టించాలి. ఎలా ఇబ్బందులకు గురి చేయాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎలా గెలిపించుకోవాలనే ప్రయత్నాల్లో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరి ఇలాాంటి సమయంలో అనవరసర వివాదాలు పెట్టుకోకుండా సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్లడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ చంద్రబాబు అరెస్టే ప్రధానాంశంగా ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. అభివృద్ది, అప్పులు, రోడ్లు, రౌడీ రాజకీయాలు, చంద్రబాబు అరెస్టు ఇలా పక్కా ప్లాన్ తో సమరానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడు మౌనంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యుహంతో ముందుకు వస్తారో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.