
కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణం నిధుల మళ్లింపు కోసమే జరిగిందని, ఇది కేసీఆర్ కుటుంబ అవినీతికి సాక్ష్యమని ఉత్తమ్ ఆరోపించారు. తమ్మిడిహట్టి ఆనకట్టను పక్కనపెట్టడం ద్వారా తప్పు చేశారని, ఈ నిర్ణయం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందని తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును కొనసాగించి ఉంటే 62 వేల కోట్ల రూపాయలు ఆదా అయి, ఇతర ప్రాజెక్టులు పూర్తయ్యేవని ఆయన అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఏర్పాటు నాటికి 6,156 కోట్లు, 2016 నాటికి 11,679 కోట్లు ఖర్చయ్యాయని ఉత్తమ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే, ఏటా విద్యుత్ ఖర్చు కేవలం 1,000 కోట్లుగా ఉండేదని, కానీ కాళేశ్వరం పంపులు నడిస్తే ఏటా 10,000 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చేదని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్, హరీశ్ రావు ప్రధాన కారణమని ఆరోపించారు.
నాసిరకం నిర్మాణాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం బలైందని, దీని వల్ల రాష్ట్ర ప్రజలపై వడ్డీ భారం పడిందని విమర్శించారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కొనసాగించకపోవడం రాష్ట్ర ఆర్థిక నష్టానికి కారణమైందని ఆయన ఉద్ఘాటించారు. ఈ తప్పిదాలు రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశాయని, బీఆర్ఎస్ ఈ వైఫల్యాలకు బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు