
వివిధ రకాల భూములను సులభంగా గుర్తించేందుకు రంగుల కేటాయింపు విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి అనగాని పేర్కొన్నారు. రూ.10 లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు, రూ.10 లక్షలు దాటిన భూములకు రూ.వెయ్యి చెల్లించి సర్టిఫికెట్లు పొందే సౌకర్యం కల్పించారు. ఆగస్టు 2 నాటికి కుల ధ్రువపత్రాలను మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. పేదలకు నివాసయోగ్య ఇళ్లు అందించేందుకు, విలేకరుల ఇళ్ల సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.రెవెన్యూ శాఖకు వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3 లక్షలకు పైగా పరిష్కరించినట్లు మంత్రి అనగాని తెలిపారు.
‘తొలి అడుగు’ కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా వేగంగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. 250 ఎకరాలను బ్లాక్‌గా తీసుకుని పారదర్శకంగా రీసర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. శ్మశానవాటికల నిర్మాణానికి రూ.138 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ చర్యలు పేదలకు లబ్ధి చేకూర్చేలా ఫ్రీహోల్డ్ భూముల విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు.ఈ సంచలన నిర్ణయాలు రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, పేదల భూసమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం నిర్వహించిన భూ సర్వేలో లోపాలను సవరించి, సమగ్ర సమాచారంతో కూడిన రికార్డులను సిద్ధం చేయడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యలు రాష్ట్రంలో భూ సంస్కరణలకు కొత్త దిశను చూపుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు