వైఎస్ జగన్ సంక్షేమ యాత్ర జోరుగా సాగుతోంది. బడుగు, బలహీన వర్గాలతో పాటు సమాజంలోని ఇతర వర్గాలపైనా జగన్ వరాలు కురిపిస్తున్నారు. రైతుభరోసా, ఆటోవాలా లకు పది వేలు, చేనేతన్నలకు రూ. 24 వేలు..ఇలా జగన్ ప్రకటిస్తున్న వరాల వెల్లువ చాలా ఉంది. పక్క రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్..ఖజానా ఖాళీ అయ్యిందని బహిరంగంగా చెబుతున్నారు.


కానీ జగన్ మాత్రం వరాల జోరు ఆపడం లేదు. తాజాగా ఆయన కుర్ర లాయర్లపైనా కరుణ చూపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ఒకొక్కటిగా అమలు చేస్తున్నారు. యువ న్యాయవాదులకు సీఎం వైయస్‌ జగన్‌ రూ. 5 వేల ఉపకార వేతనం ఇవ్వనున్నారు.


ఇందుకు జీవో నంబర్‌ 75ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్‌ 3వ తేదీన జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ‘వైయస్‌ఆర్‌ లా నేస్తం’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. యువ లాయర్లకు వరుసగా మూడేళ్లు ఈ కానుక ఇవ్వనున్నారు. యువ న్యాయవాదులు తమ రంగంలో నిలదొక్కుకునేందుకు ఈ ఆర్థిక సాయం బాగా ఉపయోగపడనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: