తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇది శుభవార్తే.. హైదరాబాద్ బాలానగర్ లోని సీఐటీడీ.. అంటే.. పరికరాల ఆకృతి కేంద్ర సంస్థ.. లో నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం వసతి సౌకర్యాలను కల్పించనుంది.

 

గత డిసెంబరు 23తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద కుమార్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జి రాజశేఖర్ రెడ్డి ఆ కేంద్రాన్నిసందర్శించారు. ఆ సమయంలో అక్కడున్న విద్యార్థులు వసతి సమస్య గురించి తెలిపారు.

 

దీనిపై వినోద్ స్పందించి... సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు లేఖ రాశారు. విద్యార్థుల వసతి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సూచించారు. ఈ మేరకు కొప్పుల ఈశ్వర్ దీనిపై ప్రతిపాదనలు చేశారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో ఈ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత హాస్టల్ సదుపాయం సమకూరనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: