ప్ర‌స్తుతం ప్రపంచ‌దేశాల్లోనూ క‌రోనా కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలోనే రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ర‌ణాలు భారీ స్థాయికి చేరుకుంది. మ‌రోవైపు‌ ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఉపాధి కోల్పోతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో  డిగ్రీ, పీజీ అర్హ‌త‌తో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 510 ఖాళీలు ఉన్నాయి. స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలోస్, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ లాంటి పోస్టులు ఉన్నాయి. వీటి పూర్తి వివ‌రాలు చూస్తే..  మొత్తం 510 ఖాళీలు ఉండగా అందులో స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్- 10, యంగ్ ఫెలోస్- 250, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్- 250 పోస్టులున్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలోస్ పోస్టులకు ఎకనమిక్స్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, డెవలప్‌మెంట్ స్టడీస్ లాంటి సబ్జెక్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ కావాలి.

అలాగే క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ కావాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. వేతనాల వివరాలు ప‌రిశీలిస్తే స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌కు రూ.55,000గా, యంగ్ ఫెలోస్‌కు రూ.35,000గా, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్‌కు రూ.12,500గా నిర్ణ‌యించారు. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 2020 ఆగస్ట్ 10 చివరి తేదీగా ప్ర‌క‌టించింది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఈ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nirdpr.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: