ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి.  ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. మ‌రోవైపు ఈ క‌రోనా ప్రభావం అన్ని రంగాల‌పై ప‌డుతుంది కానీ.. బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు పెరిగి కొండెక్కి కూర్చుంటున్నాయి.  పెరుగుతున్న బంగారం, వెండి ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి.

 

ఈరోజు పసిడి పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల కారణంగా దేశీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగిందని నిపుణులు అంటున్నారు. ఇక బంగారం ధర పెరిగితే.. వెండి ధర ఇంకా భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 పైకి కదిలింది. రూ.44,840కు చేరుకుంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.47,870కు చేరింది. ఇక వెండి కూడా ఇదే దారిలో న‌డిచింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ మార్కెట్‌లో వెండి ధర రూ.45,250కు చేరింది. 

 

అలాగే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,800కు చేరుకుంది. అదే స‌మ‌యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పైకి కదిలింది. దీంతో అక్క‌డ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600కు చేరింది.  పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర భారీగా పెరిగింది. ప్ర‌స్తుతం అక్క‌డ‌ కేజీ వెండి ధర రూ.45,250కు చేరింది. ఏదేమైనా ఈ స్థాయిలో బంగారం పెర‌గ‌డం.. సామాన్యుల్లో ఆందోళ‌న రేకెత్తిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: