హైదరాబాద్ వంటి మహా నగరాల్లో సీసీ కెమెరాల వినియోగం పెరిగాక దొంగతనాల సంఖ్య కాస్త తగ్గముఖం పట్టింది. కానీ సీసీ కెమెరాలు అంతగా లేని పట్టణ ప్రాంతాలు, గ్రామాల్లో మాత్రం దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లల్లో మాత్రమే కాదు..పెద్ద పెద్ద షాపుల్లోకి చొరబడి బంగారం, నగదును ఎత్తుకెళ్తున్నారు.ఇంటి దొంగను ఈశ్వరుడిని పట్టలేరు అంటారు .కానీ అలాంటిది  మన పోలీస్ లు మాత్రం దొంగతనం  జరిగిన 24 గంటల్లోనే  దొంగను పట్టుకున్నారు . సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో చందు జైన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది

. 21.30 లక్షల విలువ చేసే 1219 గ్రాముల బంగారం, 302 గ్రాములు వెండి ఎత్తుకు వెళ్లారు దుండగులు. ఈ భారీ చోరీని కేవలం 24గంటల్లోనే చేదించారు పోలీసులు.పాట్‌ మార్కెట్‌కు చెందిన అనిల్‌ జైన్‌.. అదే ప్రాంతంలో నేమిచంద్‌ జైన్‌ జువెల్లరీ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు.అయితే శుక్రవారం సంక్రాంతి పండగ కావడంతో ఇంట్లోనే మద్యాహ్నం వరకు కుటుంబసభ్యులతో గడిపిన అతడు ఆలస్యంగా షాప్ తెరిచాడు .అయితే షాప్ తెరవగానే అతడు షాక్ కు గురయ్యాడు. షాప్ లోని వస్తువులన్నీ చిందరమందరంగా పడటంతో చోరీ జరిగినట్లు గుర్తించిన అతడు పోలీసులకు సమాచారం అందించారు. మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, ఏసీపీ వినోద్‌కుమార్‌ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.. గంటల వ్యవధిలోనే పోలీసులు చోరీ కేసుని చేధించారు .

ఈక్రమంలోనే షాప్ లో పనిచేసే వారితో పాటు యజమాని అనిల్ జైన్ వద్ద పనిచేసే వారిని విచారించారు.ఈ క్రమంలోనే అనిల్ జైన్ డ్రైవర్ వ్యవహారశైలి అనుమానంగా కనిపించడంతో అతడిని తమదైన స్టైల్లో విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను కూడా అరెస్టు చేశారు. రోజూ చూస్తున్న షాప్ కావడంతో ఎలా చోరీ చేయాలి, ఏ సమయంలో చోరీ చేస్తే ఇబ్బంది ఉండదు లాంటి అనేక విషయాలను డ్రైవర్ తన స్నేహితులతో చెప్పి ఈ ప్లాన్ చేసినట్టు గుర్తించారు.శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దుకాణం వెనుక వైపు ఉన్న వెంటిలేటర్‌ గ్రిల్స్‌ వంచి లోపలికి ప్రవేశించినట్లు అతడు తెలిపాడు...



మరింత సమాచారం తెలుసుకోండి: