పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా నాలుగో తగ్గిన ధర.. గత నాలుగు రోజులుగా
పసిడి ధరలు కిందకు వస్తున్నాయి. బంగారం కొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది.
పసిడి వెలవెలబోతూనే ఉంది. ఈరోజు కూడా ధర బాగా పడిపోయింది. ఎప్పుడూ పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు ఒకేసారి ఇంతగా తగ్గడం పై మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి ధర తో పోలిస్తే ఈరోజు ధర అమాంతం నేల చూపులు చూస్తుంది. భారతీయ
మార్కెట్లో నమోదు అయిన ధరలు ఊరట కలిగిస్తున్నాయి. బంగారాన్ని కొనాలని భావించే వారికి ఈ ధరలు సంతోషాన్ని కలిగించింది.
ఇకపోతే ఈ రోజు
మార్కెట్ లో నమోదు అయిన రేట్లను పరిశీలిస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించింది. దీంతో రేటు రూ.48,380కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పడిపోయింది. దీంతో ధర రూ.44,350కు తగ్గింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం,
వెండి ధరలు పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో
పసిడి రేట్లు పడిపోవడం గమనార్హం. బంగారం పై
వెండి ధరలు కూడా ఆధారపడి ఉన్నాయి.
నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజు భారీగా తగ్గిపోయింది.. కేజీ
వెండి ధర రూ.1,000 దిగొచ్చింది. దీంతో రేటు రూ.72,200కు తగ్గింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం కూడా ఒక కారణం గా చెప్పవచ్చు..అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 1792 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే
వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 26.28 డాలర్లకు చేరింది. మరి రేపు కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది..