సాధార‌ణంగా వాము అంద‌రికి తెలిసిందే. వాము వంటలలో ఉపయోగిస్తుంటారు. భారతదేశంలోని వంటశాలలో విరివిగా వినియోగించే ఆహారపదార్ధాలలో వాము ముందు వరుసలో ఉంటుంది. భారత ప్రాచీన కాలం నుండి కూడా ఈ వామును జీర్ణ వ్యవస్థలోని లోపాలను సవరించాడనికి వినియోగించడం పరిపాటి. ఆహారానికి మంచి సువాసనను జతచేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్న ఈ వాము మితంగా కూడా తీసుకోవాలి. అలాగే వాము ఓ మంచి ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. మ‌రి వాముతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


- గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మ‌రియు వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.


- జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా చేసేది గ్యాస్ట్రిక్ జ్యూస్ కాగా వాములో ఉండే ఎంజైములు అందుకు బాగా తోడ్పడుతాయి. అందుకనే కడుపు నొప్పికలిగినా, వాతం చేసినా వాము తింటే వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది.


-  జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.


- వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.


- బరువు తగ్గేందుకు వినియోగించే మందులతో పాటు గుండె మరియు మూత్రపిండాల సమస్యల పరిష్కారానికి వినియోగించే మందులలో కూడా వామును ఎక్కువగా వినియోగిస్తారు.


- వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం స‌మ‌స్య‌ తగ్గుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: