
ఓట్స్ ఇడ్లీ తినడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అంతే కాదు ఇందులో బీటా గ్లూకెన్ అనే పీచు పదార్థం ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మధుమేహం కూడా అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.. అయితే ఎవరైతే డయాబెటిస్ తో బాధపడుతున్నారో అలాంటి వారు తమ ఆహారంలో ఓట్స్ ను చేర్చుకోవడం వల్ల సమస్యలు దూరమవుతాయి. ఇక అంతే కాదు గుండెపోటు వంటి సమస్యలు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువే. ప్రతిరోజు ఓట్స్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడి.. ఒత్తిడి తగ్గుతుంది.
అయితే మనకు ఓట్స్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి.. యూట్యూబ్ వంట ఛానల్ లో అధికంగా చూపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ ఓట్స్ ఇడ్లీ తయారుచేసుకుని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ వారు ఇడ్లీని తినమని వైద్యులు సైతం సిఫార్సు చేస్తున్నారు.