సాధారణంగా స్త్రీల కంటే మగవారికి ఎక్కువగా మూత్రాశయ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మగవారు ఎక్కువగా ధూమపానం చేస్తూ ఉంటారు. రాను రాను కాన్సర్ కి దారి తీస్తుంది. అన్ని రోగాల కంటే మూత్రశయ క్యాన్సరు అత్యంత ప్రాణాంతకం. కాబట్టి మొదటి దశలోనే గుర్తించి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రకటనల్లోనూ, లోను ధూమపానం ఆరోగ్యానికి హానికరమని చూస్తూ ఉంటాము. కొంతమంది దాన్ని పట్టించుకోకుండా ధూమపానం చేస్తూనే ఉంటారు.

 ధూమపానం చేసేవారు తమకు తాము హాని కలిగించుకోవడం కాకుండా పక్కన ఉన్న వారికి కూడా హాని కలిగిస్తారు. వారికి వారి పక్కన ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం  ఎక్కువగా ఉంటుంది. మనం చేసే వారికి మూత్రశయ్య క్యాన్సర్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది. ఇది మూత్రాశయం యొక్క పై భాగం నుండి కండరాలకు వ్యాపించే క్యాన్సర్‌ను ఇన్వేసివ్ బ్లాడర్ క్యాన్సర్ అంటారు.

మూత్రాశయ క్యాన్సర్ కారణాలు
 సిగరెట్, సిగార్ లేదా పైపు స్మోకింగ్రసాయనాలకు మూత్రాశయము గురి కావడం వల్ల మొదట్లో మూత్రశ ఇన్ఫెక్షన్ వాపు కు గురి కావడం జరుగుతుంది. రాను రాను పుండుగా తయారై కాన్సర్ కి దారితీస్తుంది.
 
లక్షణాలు..
మూత్ర విసర్జన వెళ్లే విధానంలో మార్పు, మూత్రంకు వెళ్ళినప్పుడు రక్తం పడటం, వెన్నునొప్పి,మూత్రం అవయవాలు నొప్పికి గురికావడం వంటివి జరుగుతాయి.
 
చికిత్స..
మూత్రాశయ క్యాన్సర్ వ్యాప్తి చెందడానికి మొదటి దశలోనే గుర్తించాలి.అప్పుడు గుర్తిస్తే ప్రాణంతకం కాకుండా నయం చేసుకోవచ్చు. క్యాన్సర్ కణితి యొక్క స్కోప్డ్ ట్రాన్స్‌యురెత్రల్, సెగ్మెంటల్ ఎక్సిషన్ వాడి కణితిని పూర్తిగా తొలగించుకోవచ్చు. దీనిని శస్త్రచికిత్స, లేదా కీమోథెరపీ ద్వారా తొలగించుకోవాలి.

యూరిన్ కలర్ మారిన,లేదాయూరిన్ లో రక్తం పడ్డ వెంటనే డాక్టర్ నీ కన్సల్ట్ అవడం చాలా మంచిది.సాధారణంగా మూత్రాశయ క్యాన్సర్‌ను నివారణకు అంటూ చికిత్స లేదు కానీ ప్రాణాపాయ స్థితికి రాకుండా ముందు జాగ్రత్త పడాలి. వివిధ రకాల పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల అందులో వున్న యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా క్యాన్సర్ కి కారణం అయే ప్రీ రేడికల్స్ నీ నివారించుకోవాలి. అలాగే దుమపానం,ఆల్కహాల్ వంటి వాటికీ దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: