మనం జొన్నలను కూడా మనం తినే ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చిరుధాన్యాలైన జొన్నలు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఈ జొన్నలను పిండిగా చేసి రొట్టెలు చేయడంతో పాటు వీటిని రవ్వగా చేసి గట్కా వంటి పదార్ధాలని కూడా తయారు చేస్తారు.ఈ జొన్న గట్కా చాలా రుచిగా కూడా ఉంటుంది.పాతకాలంలో తెలంగాణా వంటకాల్లో ఇది కూడా ఒకటి.ఈ జొన్న గట్కను తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. తెల్లబియ్యంతో వండిన అన్నం కంటే జొన్న గట్కను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇక జొన్న రవ్వతో ఆరోగ్యానికి మేలు చేసే జొన్న గట్కను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


జొన్న గట్కా తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా జొన్న రవ్వను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి వేడి చేయాలి. ఆ నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. ఇక ఇప్పుడు మంటను చిన్నగా చేసి మూత పెట్టాలి. ఈ రవ్వను మద్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే దాకా ఉడికించాలి. ఆ రవ్వ పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జొన్న గట్కా ఈజీగా తయారవుతుంది. ఈ గట్కా చల్లారే కొద్ది గట్టిపడుతుంది కాబట్టి ఇది కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇక ఇలా తయారు చేసిన జొన్న గట్కా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇక వెజ్,నాన్ వెజ్ కూరలల్లో దేనితో తిన్నా కూడా ఈ గట్కా చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: